ఎన్టీఆర్ విలన్ గా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Youungtiger NTR ) కి ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో స్టార్ డమ్‌ దక్కింది.రికార్డ్‌ స్థాయి లో సినిమా వసూళ్లు సొంతం చేసుకోవడంతో అంతర్జాతీయ స్థాయి లో కూడా సినిమా గురించి చర్చ జరిగింది.

 Ntr Fans Unhappy About War 2 Movie,junior Ntr,hrithik Roshan,war 2,bollywood,vil-TeluguStop.com

అంతే కాకుండా సినిమా తో ఎన్టీఆర్‌ కి మంచి ఫాలోయింగ్ దక్కింది.అందుకే బాలీవుడ్ లో ఎన్టీఆర్‌ ను వార్ 2( War2 Movie ) సినిమా లోకి తీసుకున్న విషయం తెల్సిందే.

హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.సినిమా లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ కన్ఫర్మ్‌ అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్‌ హీరోగా కాకుండా విలన్ గా( NTR as Villain ) కనిపించబోతున్నాడు.హృతిక్‌ రోషన్( Hrithik Roshan ) వంటి సీనియర్‌ స్టార్‌ హీరో కు పోటీగా విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ సినిమా తో కచ్చితంగా ఎన్టీఆర్ సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ ఎత్తున సినిమా యొక్క అంచనాలు ఉన్నాయి.

కనుక ఎన్టీఆర్‌ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) ఆయన్ను విలన్ గా చూడాలని అనుకోవడం లేదు.

బాలీవుడ్( Bollywood ) లో హీరోగా సినిమా చేస్తే బాగుండేది.చాలా మంది హీరోలు చాలా సీనియర్ లు అయిన తర్వాత మాత్రమే విలన్ పాత్ర ల్లో కనిపిస్తూ ఉన్నారు.అలాంటిది ఎన్టీఆర్‌ మాత్రం అప్పుడే విలన్ గా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నందమూరి అభిమానులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్ గురించి రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ను వార్‌ 2 లో ఎలా చూపిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube