తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఏ హీరో సినిమా చూసినా కూడా వందల కోట్లు బడ్జెట్ అని అంటున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు.ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ ఒక రేంజ్ వరకు ఉండేది.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు కూడా బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్( Jr ntr ) గ్లోబల్ స్టార్ గా మారడంతో పాటు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రేజ్ ఏర్పడటంతో ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఫిక్షన్ సబ్జెక్ట్‌తో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.
దేవర సినిమా( Devara movie ) తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా వార్ 2.ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవగా త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్ వార్2( War 2 ) మూవీలో కూడా తన పెర్‌ఫార్మెన్స్‌తో బాలీవుడ్‌లో జెండా పాతే అవకాశం ఉంది.ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.యష్‌రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో నటించనున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఈ సినిమాను 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
ఇది కూడా రెండు భాగాలుగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అలా ఎన్టీఆర్ నటించబోయే దేవర,వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా ఈ మూడు సినిమాల బడ్జెట్ మొత్తం 1200 కోట్ల రూపాయలు అవుతోంది.
ఒక్కసారిగా ఇమేజ్ పెరిగిపోయి గ్లోబల్ స్టార్‌గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ బడ్జెట్ పరంగా కూడా అందరికీ షాక్ ఇస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్స్ చూస్తుంటే ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కిందని అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.







