ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన కొంతమంది స్టార్ హీరోల మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తే మన కడుపు నిండిపోతుంది.హీరోలు ఇంత సన్నిహితంగా ఉంటారు, కానీ అభిమానులు ఎందుకు సోషల్ మీడియాలో ఆ రేంజ్ కొట్టుకుంటూ ఉంటారు అని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
అలా దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద హోరాహోరీగా పోటీపడిన మెగా మరియు నందమూరి కుటుంబాల నుండి నేటి తరం మాస్ హీరోలు గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్( Ram Charan ) మరియు ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితులు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న సాన్నిహిత్యం కి, అభిమానుల మధ్య జరిగే గొడవలకు అసలు ఏమాత్రం పొంతన లేదు.
ఇద్దరు సొంత అన్నదమ్ములు లెక్క ఉంటారు.వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అంత స్వచ్ఛమైనది కాబట్టే, #RRR చిత్రం లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ రేంజ్ లో వర్కౌట్ అయ్యింది.
చాలా మంది సినిమా కోసమే వీళ్ళిద్దరూ స్నేహం నటించారు అని అనుకున్నారు.కానీ ఈ చిత్రం ప్రారంభం అవ్వకముందు నుండే వీళ్ళు మంచి స్నేహితులు. #RRR మూవీ ప్రొమోషన్స్ సమయం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవ్వరికీ తెలియని వీళ్ళ బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు.#RRR తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య అదే రేంజ్ స్నేహం కొనసాగుతుంది.
రీసెంట్ గానే రామ్ చరణ్ టాలీవుడ్ లో తన మనసుకి ఎంతో దగ్గరైన వాళ్ళని పిలిచి దీపావళి పార్టీ ని ఇచ్చాడు.ఈ పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కూడా విచ్చేశాడు.
ఆయనతో పాటుగా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా వచ్చారు.అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా( Klin Kaara ) కోసం ఒక విలువైన బహుమతిని తీసుకొచ్చాడట.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఈ బహుమతిని ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) చేతుల మీదుగా క్లిన్ కారా కి ఇచ్చాడట.ఒక విలువైన నెక్లెస్ ని క్లిన్ కారా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చినట్టు సమాచారం.ఎన్టీఆర్ కి ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టం.
ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ కూడా తనకి ఒక కూతురు లేదే అనే వెలతి ఆయనలో ఉండేదట.ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయం చెప్పుకొచ్చాడు.
అందుకే తన మిత్రుడు రామ్ చరణ్ కూతురి పట్ల ఇంత ప్రత్యేకమైన అభిమానం , ప్రేమ చూపించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.