బాగా గ్లామరస్ గా ఉండాలి ... హీరోయిన్ కి గట్టిగా చెప్పిన ఎన్టీఆర్

ప్రసారమైన మొదటి రోజే రికార్డు స్థాయి టీఆర్పీ సాధించింది బిగ్ బాస్.అంతా ఎన్టీఆర్ స్టార్ డం వల్లే.

ఆ తరువాత కూడా టీఆర్పీ బాగున్నా, మరీ ఆశించిన స్థాయిలో లేదు.దీనికి కారణాలు అనేకం.

పిచ్చి పిచ్చిగా ఆసక్తి రేకెత్తించే వివాదాలు ఎక్కువ జరగలేదు ఇప్పటివరకు.సంపూర్నేష్ బాబు వెళ్ళిపోవడం కూడా పెద్ద లోటు.

ఇప్పుడిప్పుడే ప్రిన్స్ - అర్చనల కొత్త లవ్ స్టోరి వలన బిగ్ బాస్ ఇంటరెస్టింగ్ గా మారుతోంది.కాని ఎంతకాలం ? కేవలం వీకెండ్ వచ్చే ఎన్టీఆర్ ఎంత అని లాగుతాడు షోని ? కేవలం తన మీదే ఆధారపడితే ఎలా ? ఇంట్లో మసాలా - వివాదం .ఇవన్ని ఉంటేనే షో సూపర్ హిట్ అయ్యేది.70 రోజులు నడిచే షో అన్నప్పుడు ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా చూడటం పెద్ద ఛాలెంజ్.అందులోనూ జనాలకి అలవాటైన జబర్ దస్త్ ధాటిని తట్టుకొని నిలబడాలి షో.తెలుగు బిగ్ బాస్ కథ ఇలా ఉంటే, తమిళ బిగ్ బాస్ కథ మరోలా ఉంది.అక్కడ కేవలం కమల్ హాసన్ మీద నడవట్లేదు షో.ఒవియా అనే అమ్మాయి పెద్ద స్టార్ అయ్యి కూర్చుంది.ఆమె అందం, చలాకీతనం షోకి పిచ్చి టీఆర్పీ తీసుకొస్తోంది.

Advertisement

కమల్ రాని వారంలోని అయిదు రోజులు కూడా తీఆర్పి అదిరిపోతోంది.అందుకు కారణం ఒవియా.

ఈ అమ్మాయి బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకి రాగానే, నేను ఛాన్స్ ఇస్తానంటే, నేను ఛాన్స్ ఇస్తానంటూ పోటిపడుతున్నారు తమిళ దర్శకనిర్మాతలు.అలాంటి గ్లామర్ పవర్ తెలుగు బిగ్ బాస్ లో కరువైంది.

అందుకే ఓసారి ప్రిన్స్ కూడా బిగ్ బాస్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, అందమైన అమ్మాయిలని పంపించండి అని.బిగ్ బాస్ ప్రిన్స్ మాట విన్నాడు.అయితే ఇక్కడ అందమైన అమ్మాయి అవసరం ప్రిన్స్ కన్నా ఎక్కువ బిగ్ బాస్ కే ఉంది.

స్టార్ మాకి తెలుగులో కూడా ఒవియా లాంటి అమ్మాయి కావాలి.హిందీ బిగ్ బాస్ ద్వారా సన్నీ లియోన్, శ్వత తివారి, వీణా మాలాకి లాంటి అమ్మాయిలు ఎలా ఫేమస్ అయ్యారో మీకు తెలిసిందే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

ప్రతి సీజన్ ఒక్క అందమైన అమ్మాయి అయినా క్లిక్ అవ్వాలి.యూత్ అలాంటి అమ్మాయి కోసమే చూస్తారు.అందుకే దీక్ష పంత్ ని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపిస్తున్నారు.

Advertisement

ఎవరు ఈ దీక్ష పంత్ ? చాలామందికి ఈ అమ్మాయి ఎవరో తెలియదు.కొన్ని చిన్ని సినిమాలు చేసింది.

పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాలో ఆ స్వామిజీలతో కనిపించేది ఈ అమ్మాయే.జనాలకి తెలియని ముఖమే అయినా, చాలా హాట్ గా ఉంటుంది.

ఒవియా కూడా బిగ్ బాస్ కి ముందు ఎవరికీ తెలుసు అని ? తెలుగులో కరువైన గ్లామర్ పవర్ ని తీసుకురాబోతోంది దీక్ష.ఎన్టీఆర్ తో పాటు స్టార్ మా యాజమాన్యం ఏరికోరి దీక్షని సెలెక్ట్ చేసారు.

అలాగే తనకి అన్ని విషయాలు ముందే చెప్పెసారట.పెద్దగా స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు కాని, గ్లామరస్ గా కనబడాలి, కుర్రాళ్ళ మతులు పోగొడుతూ ఒవోయా లాగా స్టార్ అవ్వాలి అని.అందుకే దీక్ష వచ్చి రావడంతోనే స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది.ఇలా చేయమని ముందే చెప్పిందట యాజమాన్యం.

సో, ఈరోజు నుంచి బిగ్ బాస్ ఇంట్లో దీక్ష పంత్ గ్లామర్ డోసు మొదలవుతుంది అన్నమాట.

తాజా వార్తలు