వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం అదుర్స్.( Adhurs ) ఇందులో నయనతార( Nayantara ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా అదుర్స్ సినిమా పేరు వినగానే అందులో జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మానందం కామెడీ సీన్లు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మనందం ( Brahmanandam ) కామెడీ టైమింగ్స్ కామెడీ అదుర్స్ అని చెప్పవచ్చు.ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలోని బ్రహ్మానందం ఎన్టీఆర్ డైలాగ్స్ తరచూ మనకు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇకపోతే అదుర్స్ సినిమా విడుదల తర్వాత అభిమానులు ప్రేక్షకులు అదుర్స్ కి సీక్వెల్ చేయాలి అంటూ చాలా సార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.ప్రేక్షకుల కోరిక మేరకు వివి వినాయక్ కూడా అదుర్స్ 2 సినిమా( Adhurs 2 ) చేసే ఆలోచన ఉంది అని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.ఇది ఇలా ఉంటే తాజాగా రచయిత కోన వెంకట్( Kona Venkat ) తారక్ అభిమానులకు చక్కని శుభవార్తను తెలిపారు.అదుర్స్-2 స్టోరీ లైన్ కూడా రెడీగా ఉందని చెబుతూ సర్ ప్రైజ్ ఇచ్చారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రచయిత కోన వెంకట్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అమెరికాలో( America ) అదుర్స్ అని నేను సీక్వెల్ కి ఎప్పుడో కథ అనుకున్నాను.
తన గురువుతో కలిసి చారి అమెరికా వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మంచి ట్విస్ట్ లు, టర్న్ లతో ఉంటుంది.ఎన్టీఆర్ ఓకే అంటే మూడు నెలల్లో స్క్రిప్ట్ రెడీ చేసి షూట్ కి వెళ్లిపోవడమే.కానీ ఇప్పుడు తారక్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.
పైగా పలు సినిమాలు కమిటై ఉన్నాడు.అయితే తారక్ ఫ్యాన్స్ నచ్చే టాప్-5 లో ఫిలిమ్స్ లో అదుర్స్ ఖచ్చితంగా ఉంటుంది.
ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోరుకుంటున్నారు.అన్నీ కుదిరి త్వరలోనే సీక్వెల్ రావాలని కోరుకుందాము.దేనికైనా టైం రావాలి.అప్పుడు నేను అదుర్స్ లైన్ సరదాగా మాట్లాడుతూ చెప్పాను.తారక్ కి బాగా నచ్చి, కొత్తగా ఉంటుంది చేద్దాం అన్నాడు.అలాగే అదుర్స్-2 కి అన్నీ కలిసొచ్చి అలాంటి మూమెంట్ రావాలి అని చెప్పుకొచ్చారు కోన వెంకట్.