ఎన్టీఆర్ సినిమాల విషయంలో చాలా రోజుల నుంచి సందిగ్ధంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పాలి.ఇలా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఎన్టీఆర్ కి ఎంతో మంచి క్రేజ్ తీసుకు వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించారు.కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇకపోతే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులలో ఆందోళన నెలకొంది.
ఆచార్య డిజాస్టర్, రాజమౌళి సినిమా తర్వాత సినిమా చేస్తే తప్పకుండా ఆ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని సెంటిమెంట్ ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని ఎదురుచూస్తున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ ఎదురవుతూనే వస్తుంది.ఇదిగో అదిగో అంటూనే దాదాపు పది నెలల సమయం వృధా చేశారు.ఒకానొక సమయంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ కొరటాల సినిమా షూటింగుకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది.ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోనుందని సమాచారం.







