లండన్‌లో రూ.3 కోట్లకు పైగా జీతం సంపాదిస్తున్న ఎన్నారై.. ఆయన చేసేదేంటంటే..

యూకే, యూఎస్( UK, US ) వెళ్లి అక్కడ జాబ్ చేసేవారికి కోట్లలో డబ్బులు వస్తాయని చాలామంది భావిస్తుంటారు.

ఆ శాలరీలు ఓన్లీ తెలివైన వారికే లభిస్తాయని మరికొందరు వాదిస్తుంటారు.

శాలరీలు ఎంత వచ్చినా అక్కడ టాక్స్ కట్ అవుతాయని అనుకునేవారూ ఉన్నారు.అయితే ఇటీవల కాలంలో ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ ఫారిన్ కంట్రీలో భారతీయులు ఏ జాబ్ చేస్తున్నారు, వారు ఎంత సంపాదిస్తున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నారు.

అంతేకాదు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.అవన్నీ ఇండియన్స్ లో బాగా వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా లండన్‌లోని ఒక ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో పనిచేస్తున్న ఎన్నారైని సదరు ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ఇంటర్వ్యూ చేశారు.

Advertisement

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్నట్లు ఆ ఎన్నారై తెలిపారు.ఏటా రూ.3.17 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలిపారు.ఈ మొత్తం బ్రిటన్ కరెన్సీలో( British currency ) సుమారు £300,000కు సమానం.

సదరు ఎన్నారై వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ భారీ శాలరీ చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ వార్తను ఆసక్తిగా చదివారు.కొంతమంది ఈ ఆదాయం నిజంగానే అంత ఎక్కువగా ఉంటుందా అని సందేహించారు.

ఈ బ్యాంకర్ తన ఎనిమిది సంవత్సరాల అనుభవం ద్వారా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.

ఇక టార్గెట్ కొడాలి నాని ? అన్నీ సిద్ధం చేస్తున్నారా ? 
అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్( Investment Banking ) రంగంలో ఎంత సంపాదించవచ్చో ఆ బ్యాంకర్ స్పష్టంగా చెప్పకపోయినా, ఈ రంగంలో ఎంత ఎక్కువ సంపాదించవచ్చో ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.ఈ రంగంలో విజయం సాధించాలంటే ఉన్నత చదువులు చదివితే చాలదు, మంచి సంబంధాలు ఏర్పరచుకోవడమూ ముఖ్యమని ఆయన చెప్పారు.ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ముందస్తు అనుభవం సంపాదించడం ముఖ్యమని ఆయన సలహా ఇచ్చారు.

Advertisement

"కష్టపడటం, అదృష్టం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి" అని అభిప్రాయపడ్డారు.అయితే లండన్ లో కంటే న్యూయార్క్ లో ఎక్కువ శాలరీలు పొందవచ్చు అని అడిగితే "అవును" అని ఆయన ఒప్పుకున్నారు.

ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.కొంతమంది ఈ ఎన్నారై నిజంగానే అంత శాలరీ సంపాదిస్తున్నాడా అని అన్నాడు.

లండన్ లో యావరేజ్ శాలరీ 35 వేల పౌండ్లు, ఎంతో అనుభవం ఉంటే తప్ప లక్ష పౌండ్లు సంపాదించలేరని మరొక యూజర్ కామెంట్ చేశారు.నెటిజన్లలో ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం సాధ్యమే, కాకపోతే ఆ జాబ్ చాలా స్ట్రెస్‌ఫుల్!.

తాజా వార్తలు