కరోనాతో ఉద్యోగం గోవిందా: ఆన్‌లైన్‌లో కలువ పూల బిజినెస్.. ‘‘ ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ ’’

కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు.

ముఖ్యంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయుల పరిస్ధితి ఇంకా దారుణంగా తయారైంది.

వైరస్ భయానికి తోడు ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో వారి పరిస్థితి అడకత్తెరలో పడిన పొక చెక్కలా తయారైంది.దీంతో ఎంతోమంది మూటా ముల్లె సర్దుకుని మాతృదేశానికి వచ్చేశారు.

ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నర్సుగా పనిచేసిన కేరళకు చెందిన ఎల్డోస్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం ఆన్‌లైన్‌‌లో తామర పువ్వులు అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.పదేళ్లపాటు నర్సుగా పనిచేసిన ఆయన కరోనా కారణంగా తనలాంటి చాలా మందితో కలిసి భారతదేశానికి రావాల్సి వచ్చింది.

మాతృదేశానికి వచ్చిన తర్వాత కేరళలో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అతనికి కష్టమైంది.దీంతో ఏం చేయాలో పాలుపోక ఎల్డోస్ వినూత్నంగా ఆలోచించాడు.

Advertisement

పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం.ఎల్డోస్ వివిధ రకాల కలువ పువ్వులను, డిమాండ్‌ను బట్టి వాటి దుంపలను సప్లై చేసేవాడు.

లాక్‌డౌన్ కాలంలో ఆన్‌లైన్ డెలీవరిలపై నిషేధం ఉండటంతో కస్టమర్లకు వాటిని చేరవేయలేకపోయాడు.అయితే కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ రావడంతో ఎల్డోస్ డెలివరీలను ప్రారంభించాడు.

అనతికాలంలోనే అతని కలువ పువ్వులు, దుంపలకు మంచి స్పందన వచ్చింది.దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు ఆయనకు కస్టమర్లుగా మారిపోయారు.

తన వ్యాపారానికి ప్రమోషన్ నుంచి అమ్మకాల వరకు ఎల్డోస్ అంతా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్వహించేవాడు.దుంపలు సిద్ధంగా ఉన్నాయని అతను వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచేవాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనిని చూసిన ప్రజలు ఎల్డోస్‌ను సంప్రదించేవారు.ఆయన తన బ్లాగ్ ‘‘ రాజ్-ఫ్లోరల్స్’’ ద్వారా కలువ పూలు, దుంపల ఫోటోలు, వాటికి సంబంధించిన వివరాలను పంచుకునేవాడు.

Advertisement

కస్టమర్లకు డెలివరీలు అందించిన తర్వాత కూడా మొక్కలు పెరిగే వరకు ఆయన వారికి చిట్కాలను అందిస్తూ వచ్చేవాడు.కలువ దుంపలు ఎంతో ఖరీదైనవి కావడం వల్ల వాటి పెరుగుదలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత అమ్మకదారులదేనని ఎల్డోస్ చెప్పాడు.

తన వ్యాపారం మంచి ఆదాయంతో పాటు తనకు మనశ్శాంతిని ఇస్తుందని వెల్లడించాడు.అన్నట్లు అతని దగ్గర ఒక కలువ పూల మొక్క ఖరీదు రూ.1,000.ఇక

సహస్రదళ పద్మం (వెయ్యి రేకులు)

ధర రూ.3,000 దీనితో పాటు గౌతమ బుద్ధుడు కూర్చొనే కలువ వంటి విభిన్న తామర పూల రకాలు ఎల్డోస్ వద్ద ఉన్నాయి.

తాజా వార్తలు