Whatsapp New Features: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. ఫుడ్ ఆర్డర్, క్యాబ్-ఫ్లైట్ బుకింగ్ వంటి సేవలు..

ఈరోజుల్లో చాలామంది డిజిటల్ సర్వీసుల మీద ఆధారపడుతున్నారు అయితే ఒక్కొక్క సర్వీస్ కోసం ఒక్కో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తుంది.దీనివల్ల ఫోన్‌పై భారం పడుతుంది.

ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్ కొన్ని సంస్థలతో కలిసి అన్ని డిజిటల్ సేవలను తన ప్లాట్‌ఫామ్ ద్వారానే తీసుకొస్తోంది.క్యాబ్ బుకింగ్ నుంచి ఫ్లైట్ స్టేటస్ వరకు ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారానే అనేక డిజిటల్ సర్వీసెస్ పొందొచ్చు.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కో సేవ కోసం ఒక్కో వాట్సాప్ నంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేయడమే! వాట్సాప్‌లో జియో మార్ట్ నంబర్ 7977079770 సేవ్ చేసుకోవడం ద్వారా ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్స్, డెయిరీ, బుక్స్ తదితర వాటిని ఆర్డర్ చేయవచ్చు.అయితే ఈ సేవలు కేవలం కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పిన్‌కోడ్ ఎంటర్ చేయడం ద్వారా ఈ సేవలను మీరు పొందవచ్చో లేదో తెలుసుకోవచ్చు.మీ ప్రాంతాల్లో సేవలు అందుబాటులో ఉంటే సరైన అడ్రస్సు, ఫోన్ నంబర్ తదితర బేసిక్ వివరాలు అందించి కావలసిన ప్రొడక్ట్స్ ను ఇంటికి తెప్పించుకోవచ్చు.

Advertisement

వాట్సాప్ ద్వారా ఇండిగో, ఎయిర్ ఇండియా స్టేటస్ చెక్ చేసుకునేందుకు మీ ఫోన్‌లో 9154195505 నంబర్‌ను సేవ్ చెయ్యాలి.ఉబర్ క్యాబ్ సేవల కోసం 7292000002 నంబర్‌ను సేవ్ చేయాలి.తర్వాత హాయ్ అని చెప్పి ఆపై సూచనలు ఫాలో అవుతే సరిపోతుంది.

ఆన్‌లైన్ బ్యాంక్ సేవలు కూడా వాట్సాప్ ద్వారా లభిస్తున్నాయి.ఒక్కో బ్యాంక్ ని బట్టి ఈ నంబర్ అనేది మారుతుంటుంది.

మీ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకు వాట్సాప్ నంబర్ తెలుసుకోవడం ద్వారా మీరు ఈ సేవలను కూడా పొందవచ్చు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు