సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకుని తక్కువ సమయంలోనే విడాకులు తీసుకోవడంతో ఈయన గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.
ఇకపోతే నోయల్ విడాకుల తర్వాత బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈయన నటించిన పంచతంత్ర కథలు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసారు.
ఇక తన లైఫ్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించిన నోయల్ కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.అతి తక్కువ మంది కంటెస్టెంట్లతో ఫోన్ కూడా లేకుండా బిగ్ బాస్ హౌస్లో అన్ని రోజులు ఎలా ఉండగలుగుతారని యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నోయల్ స్పందిస్తూ.సాధారణ మనుషులు ఎవరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండలేరు.అక్కడ సరైన తిండి నిద్ర అనేది ఉండవని ఈ సందర్భంగా నోయల్ పేర్కొన్నారు.మనకు తెలియకుండానే బిగ్ బాస్ హౌస్ లో ఒత్తిడికి ఆందోళన కు గురవుతామని ఈయన తెలిపారు.

మనము ఏదైనా ఒక రంగును చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.అందుకే గుడిలో కానీ లేదా హాస్పిటల్లో కానీ ప్రశాంతత కోసం ఒకే రంగును ఉపయోగిస్తారు.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా వందల సంఖ్యలో రంగులు ఉపయోగిస్తారు.ఆ రంగుల ప్రభావం వల్ల మనకు తెలియకుండానే మనం ఎంతో ఆందోళనకు గురవడమే కాకుండా మనలో టెన్షన్స్ ఎమోషన్స్ కూడా మనకు తెలియకుండానే వస్తుంటాయని నోయల్ తెలిపారు.
లేకపోతే బిగ్ బాస్ ఎప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే అప్పుడే నిద్ర పోవాలి, అలాగే ఉదయమే నిద్ర లేవాలి.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సరిగ్గా నిద్ర కూడా ఉండదంటూ ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి నోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.