జ‌గ‌న్ ఎన్ని చెప్పినా... ప‌వ‌న్ వెంటే అంటున్న‌ కాపులు

ఏపీలో అతిపెద్ద సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు జ‌గ‌న్ పై అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో వైసీపీ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

 No Matter What Jagan Says Kapu Social Category Will Keep Following Pawan Details-TeluguStop.com

కాపులను తమ వైపుకు తిప్పుకోవడానికి తెగ కష్టపడుతోందని అంటున్నారు.అయితే ఏదేమైనా ఈ సారి మాత్రం జ‌గ‌న్ కి చాన్స్ ఇచ్చే అవ‌కాశ‌మే లేద‌ని అంటున్నారు.

తాజాగా వైఎస్సార్ కాపు నేస్తం నిధులను జమ చేయడానికి సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు వెళ్లారు.ఇక అక్కడ బటన్ నొక్కి నిధులను జమ చేశాక సీఎం జగన్, కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

పవన్.చంద్రబాబుకు దత్తపుత్రుడని కాపుల ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు అమ్మేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప‌వ‌న్ ని న‌మ్మొద్ద‌ని.కాపుల‌కు అండ‌గా ఉండేది తామేన‌ని చెప్పుకున్నారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై కాపులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.కాపుల‌కు ఏ విధంగా అండ‌గా ఉన్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.అధికారంలోకి రాగానే కాపుల రిజర్వేషన్ విష‌యంలో తానేమీ చేయలేనని పక్కకు తప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.అలాగే కాపు బడుగు బలహీనవర్గాల దేవుడు.

వంగవీటి రంగాను తిట్టిపోసిన గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టే చేసి ఆ తర్వాత ఏపీ పైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని కాపులు అంటున్నారు.అలాగే వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇవ్వకుండా అవమానించారని గుర్తుచేసుకుంటున్నారు.

లిస్టు ఇచ్చి నియోజ‌కవ‌ర్గాన్ని ఎంచుకోమ‌ని ఆదేశించార‌ని.అది నచ్చకే రాధా గుడ్ బై చెప్పార‌ని మండిప‌డుతున్నారు.

Telugu Ap, Cm Jagan, Janasena, Kapu Category, Dadishetty Raja, Pawan Kalyan, Per

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంగవీటి రంగా జయంతి… వర్థంతులకు చిత్రపటాలకు విగ్రహాలకు దండలు వేసిన జగన్ అధికారంలోకి వచ్చాక కనీసం నివాళి అర్పించలేదని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.ఇక‌ కొత్తగా ఏర్పాటు చేసిన విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కాపులు డిమాండ్ చేసినా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని అంటున్నారు.ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ను కత్తి మహేష్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, కొట్టు సత్యనారాయణ, ఆళ్ల నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్ తదితరులతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టించినదాన్ని మరిచిపోబోమని వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అంత చెల్లిస్తామ‌ని అంటున్నారు.

Telugu Ap, Cm Jagan, Janasena, Kapu Category, Dadishetty Raja, Pawan Kalyan, Per

టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ వచ్చాక దాన్ని ఎత్తేశారని మండిప‌డుతున్నారు.విదేశీ విద్యా నిధి పథకాన్ని కూడా నీరుగారుస్తున్నార‌ని… గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది కాపు విద్యార్థులు విదేశాలకు వెళ్లార‌ని గుర్తుచేసుకుంటున్నారు.ముఖ్యంగా పేర్ని నానితో సొంత కులాన్నే తిట్టించిన జగన్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తప్పకుండా గుణ‌పాఠం చెబుతామ‌ని హెచ్చరిస్తున్నారు.

జ‌గ‌న్ ఎన్ని మాట‌తు చెప్పినా ఈ సారి న‌డిచేది పవన్ తోనే అని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube