ఏపీలో ఎవరెన్ని గ్రూపులు కట్టినా వైఎస్ జగన్ దే విజయమా..!!

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీతో పాటు విపక్షాలు తమ తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో సీఎం జగన్ ఓటు మట్టం పెరుగుతోందని తెలుస్తోంది.ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఎవరు ఎన్ని రకాలుగా గ్రూపులు కట్టినా, కూటములుగా ఏర్పడిన ఈ సారి కూడా జనగ్ ను నిలువరించడం కష్టమేనని తేలింది.

No Matter How Many Groups Are Formed In AP, YS Jagan Is A Winner..!!-ఏపీ�

ఈ మధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ నవ భారత్ చేసిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చినట్లు తెలుస్తోంది.తాజాగా ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సైతం మళ్లీ అదే ఫలితం వచ్చిందని సమాచారం.

పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని తెలుస్తోంది.టీడీపీ, జనసేన కలిసి వచ్చినా.? విడివిడిగా వచ్చినా గెలుపు మాత్రం జగన్ వైపే ఉంటుందని సర్వే తేల్చింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీ -జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది.

Advertisement

అదేవిధంగా ఇతరులకు పది శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.అదేవిధంగా సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా, చంద్రబాబుకు 37 శాతం మంది జై కొట్టారని తెలుస్తోంది.

ఇందులో పవన్ ను కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు.అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన బాగుందని 56 శాతం మంది చెప్పగా.22 శాతం మంది బాలేదని అన్నారని సర్వేలో వెల్లడైంది.అలాగే తొమ్మిది శాతం మంది చాలా బాగుందని చెప్పగా ఎనిమిది మంది అసలు బాలేదని చెప్పారట.

మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారని సమాచారం.అయితే 2019 సంవత్సరంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ ఓటు బ్యాంక్ ఈ సారి గణనీయంగా పెరిగిందని వెల్లడైంది.

కాగా ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి.దీంతో జగన్ కుటుంబంలో ప్రజలంతా భాగం అయ్యారని చెప్పోచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ప్రజలు కూడా జగన్ తమ ఇంటిలో సభ్యునిగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.కులమతాలు మరియు పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారునికి పథకాలు అందించారు సీఎం జగన్.

Advertisement

దీంతో లబ్ధిదారులు అంతా గంపగుత్తగా మళ్లీ జగన్ కే జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.నాడు - నేడు, పోర్టులు, విమానాశ్రయాలే కాకుండా విద్య, వైద్య వంటి రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ఓటర్లు భావిస్తున్నారు.

ఇక చంద్రబాబు కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు.అంటూ ఏవేవో చెప్పినా ప్రజలు ప్రస్తుతం ఆయనను నమ్మేందుకు సిద్ధంగా లేరు.

చంద్రబాబు పాలన చూసి నిరాశకు గురైన ప్రజలు ఆయనను ఓ అవకాశవాదిగా మాత్రమే చూస్తున్నారు తప్ప నమ్మదగిన నాయకుడిగా చూడలేకపోతున్నారట.అందుకే మొన్న మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీల టీజర్ ఫెయిల్ అయింది.

దానికి తోడు గతంలో చాలా హామీలు ఇచ్చి మరిచిన చంద్రబాబును, టీడీపీని మళ్ళీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.మరోవైపు టీడీపీ పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు.

ఈసారి కూడా జగన్ ను ఎదుర్కొనేందుకు పొత్తుల కోసం పాకులాడుతోంది.ఈ క్రమంలోనే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

అయితే దత్తపుత్రుడు వ్యాఖ్యలు చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలుస్తోంది.అలా అని పొత్తులు లేకుండా పోటీ చేసే సత్తా లేదు.

ఒకవేళ పోటీకి వెళ్లిన ఓటమి తప్పదని అర్థం అయినట్లు ఉంది.ఇక బీజేపీకి సైతం పలు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.అయితే ఆఖరుకు మూడు పార్టీలు పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమచారం.

ఇక జగన్ మాత్రం ఎవరినీ నమ్ముకోకుండా ప్రజలతోనే తన పొత్తని చెబుతున్నారు.మంచి చేశా అనిపిస్తేనే మీ బిడ్డను ఆశీర్వదించండి అని చెబుతున్నారు.

ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు మరోసారి కూడా జగనన్న పాలనవైపే మొగ్గు చూపుతున్నారు.ఇందులో భాగంగానే మరోసారి జగన్ కే పట్టం కట్టనున్నారని సర్వే రిపోర్టులు చెబుతున్నాయని సమాచారం.

తాజా వార్తలు