60 ప్లస్‌ ‘ఆచార్య’కు అనుమతి ఉందా? లేదా?

సినిమా మరియు బుల్లి తెర పరిశ్రమలు గత రెండు నెలలుగా పూర్తిగా స్థంభించి పోయాయి.కనీసం వెబ్‌ సిరీస్‌ల షూటింగ్స్‌ కూడా అనుమతించలేదు.

అంతటి విపత్కర పరిస్థితుల నుండి మెల్లగా ఇండస్ట్రీ బయట పడుతోంది.తెలుగుతో పాటు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో మళ్లీ షూటింగ్స్‌కు రంగం సిద్దం అవుతోంది.

అయితే ఈ సమయంలో భారతీయ సినిమా నియంత్రణ సంస్థ కొన్ని గైడ్‌ లైన్స్‌ను విడుదల చేసింది.దాని ప్రకారం అందరు షూటింగ్స్‌ చేసుకోవాలని సూచించింది.

గైడ్‌ లైన్స్‌లో ప్రధానమైనది రాబోయే మూడు నెలల వరకు 60 యేళ్లు దాటిన నటీ నటులను షూటింగ్‌కు తీసుకోవద్దు.వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశ్యంతోనే తాము ఈ కండీషన్‌ పెట్టామని అన్నారు.

Advertisement

ఒక వేళ షూట్‌కు అత్యవసరం అయితే రెండు లేదా మూడు రోజులు గ్యాప్‌ ఇచ్చి రోజులో కేవలం నాలుగు లేదా అయిదు గంటలు మాత్రమే వారితో షూట్‌ చేయించాలని పేర్కొన్నారు.ఈ సమయంలో ఆచార్య సినిమా పరిస్థితి ఏంటా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆలోచనల్లో పడ్డారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఆరు పదుల వయసు దాటి చాలా ఏళ్లు అయ్యింది.ఆయన ప్రస్తుతం ఆచార్య చిత్రంను పూర్తి చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ఈ 60 యేళ్ల నిబంధనతో ఆచార్య చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యేనో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఆరు పదుల వయసు దాటి ఇంకా వరుసగా చిత్రాలు చేస్తున్న స్టార్స్‌ ఎంతో మంది ఉన్నారు.

కనుక వారంతా కూడా ఇప్పట్లో కెమెరా ముందుకు వెళ్లే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?
Advertisement

తాజా వార్తలు