Revanth Reddy: బిఆర్ఎస్ పాలనలో ఆలంపూర్ అభివృద్ధి శూన్యం..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ వాటి స్పీడును పెంచాయి.రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గద్దనెక్కాలని  అన్ని పార్టీలు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

  ఈ తరుణంలోనే నాయకులను చేయి జారిపోకుండా కాపాడుకునేందుకు ఆయా పార్టీలు  రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ తరుణంలోనే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో  మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేతలను జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నివాసంలో పార్టీ కండువా కప్పి  ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్,( Radha Amar ) మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్మరేందర్ రాజ్,  కౌన్సిలర్లు రమాదేవి ఇతర నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్( CM kcr )  ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదని అన్నారు.9 ఏళ్ల పాలనలో  పాలమూరుకు చెందిందేమి లేదని ఎద్దేవ చేశారు.ఇక జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారువక్ఫ్ ల్యాండ్ సైతం వదలకుండా అక్రమాలకు పాల్పడుతూ,  అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిని మరిచారని తెలియజేశారు.

Advertisement

ఉద్యమ టైంలో కేసీఆర్ ను ఎంపీగా గెలిపిస్తే  తన ఇల్లు అమ్మైనా జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు.  ఇప్పుడు సీఎం అయినా తర్వాత జిల్లాను అభివృద్ధి చేయలేదు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది.కేటీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

పాలమూరు ప్రజలు కేసీఆర్ చేతిలో మోసపోయారని, శాండ్, ల్యాండ్, వైన్  ఇలా ఏ దందాలు చూసిన బీఆర్ఎస్ నేతల హస్తమే ఉందని ఆరోపించారు.

ఇక పోలీస్ అధికారులు అయితే బిఆర్ఎస్ ( BRS party )కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని,  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామన్నారు.అంతేకాకుండా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందామని, మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను ఆదుకునే బాధ్యత మాది అని, మీ అందరికీ నేను అండగా ఉంటానని  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు