AP Bjp : పొత్తు లేదు ఒంటరి పోరే ? ఏపీలో బీజేపీ పని అంతేనా ?

జనసేన తో కలిపి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి( BJP ) మొదటి నుంచి భావిస్తూ వచ్చింది.

కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేనకు ప్రాధాన్య ఇస్తున్నట్లుగా వ్యవహరించింది.

అయితే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పెద్దగా పోరాటాలు చేపట్టకపోవడం, జనసేన ను పట్టించుకోనట్టుగా ఏపీ బీజేపీ నేతలు కొంతమంది వ్యవహరించడం వంటివి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ఆగ్రహం తెప్పించాయి.అదే సమయంలో ఏపీలో బిజెపితో పొత్తు కొనసాగించే కంటే, బలంగా ఉన్న టిడిపి తో కలిసి ముందుకు వెళ్లడమే మేలని, కచ్చితంగా టిడిపి జనసేన కలిస్తే అధికారంలోకి రావచ్చనే లెక్కలతో పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు.

బిజెపిని సైతం తమతో కలిసి రావాలని పవన్ పదే పదే ప్రకటనలు చేయడంతో పాటు, ఢిల్లీలోని బిజెపి పెద్దల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు.అయితే జనసేన( Janasena )తో పొత్తు కొనసాగించేందుకు బిజెపికి అభ్యంతరం లేకపోయినా, టిడిపి తో మాత్రం కలిసి వెళ్లేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ఎవరు ఆసక్తి చూపించకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇప్పటికే టిడిపి, జనసేన ఏపీలో తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా తయారు చేసుకున్నా, దానిని అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు.అప్పుడు ఆ పార్టీకి కేటాయించే సీట్లు మినహా, మిగిలిన స్థానాలు మాత్రం పంచుకోవాలని భావిస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు ఆ పొత్తుపై ఆశలను టిడిపి జనసేన వదిలేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.

Advertisement

దీనికి కారణం బిజెపి ఏపీలో ఒంటరిగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడమే.ఈ మేరకు అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభించాలని ఆ పార్టీ నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయట.

దీంతో అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ సైతం దగ్గర పడిన నేపథ్యంలో ఇక స్పీడ్ పెంచాలనే ఆలోచనతో బీజేపీ ఉంది.

ఇదిలా ఉంటే జనసేన టీడీపీ కూటమి తో కలిసి వెళ్తేనే మంచిదని, ఏపీలో ఎన్నో కొన్ని సీట్లైనా దక్కుతాయి అని, అలా కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదనే అభిప్రాయాలు ఒక వర్గం బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తుండగా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ తో పొత్తు వద్దని, చావో రేవో ఒంటరిగానే పోటీ చేద్దాం అనే ఒత్తిఫై పార్టీ పెద్దల వద్ద వ్యక్తం చేస్తున్నారట.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు