తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాని ( Nani ) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ ఏడాది మొదట్లో దసరా సినిమా ( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాని తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు త్వరలోనే హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇకపోతే నాని సినీ కెరియర్ లో నటించిన సినిమాలలో నిన్నుకోరి ( Ninnu kori ) ఒకటి.శివా నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నాని సరసన నివేత థామస్ ( Nivetha Thomas ) నటించారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నివేదా థామస్ అని అనుకోలేదట ఈ సినిమాని మరొకసారి హీరోయిన్ రిజెక్ట్ చేయడంతోనే ఈ స్థానంలో ఆమె నటించారని తెలుస్తోంది.మరి ఈ సినిమాని రిజెక్ట్ చేస్తున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…
వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) ను ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని భావించారట.అయితే డైరెక్టర్ కాజల్ అగర్వాల్ ని కలిసి ఈ సినిమా కథ చెప్పినప్పటికీ సినిమా కథకు ఇంప్రెస్ అయినటువంటి కాజల్ అప్పటికే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే తనకు కాల్ షీట్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోవడం వల్లే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారని తెలుస్తుంది.మరి కాజల్ ఈ సినిమాకు నో చెప్పడంతోనే ఆమె స్థానంలో నటి నివేత థామస్ హీరోయిన్గా నటించారని తెలుస్తుంది.