అదే కనుక జరిగితే ఉద్యోగం చేసుకుంటా.. ఆ సత్తా నాకుంది: నివేదా పేతురాజ్

మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేద పేతురాజ్.

ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా స్టార్ డమ్ సంపాదించుకోలేక పోయింది.

ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించినప్పటికీ ఈమెకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే తనకు వచ్చిన అవకాశాలను అందుకొని సినిమాల్లో నటించడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్ తన వృత్తి పరమైన విషయాలు గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ అవ్వడం కాదు నటి అని పిలిపించుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

చాలామంది హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరియర్ ఉండదని చాలా భయపడుతూ ఉంటారు.తనకు అలాంటి భయాలు ఏమీ లేవని ఈమె తెలియజేశారు.తనకు నటన పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదని, నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలు వచ్చినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Advertisement

ఇక తనకు ఎప్పుడైతే అవకాశాలు రానప్పుడు తప్పకుండా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగం చేస్తాననీ, ఉద్యోగం చేసే సత్తా తనలో ఉందని ఈమె తెలిపారు.ఇక ఈమె నటించిన విరాటపర్వం సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకురానుంది ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా నివేద పేతురాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు