ఉగ్రవాదులకు సాయం చేసిన సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు.. సంచలనం రేపుతున్న వీడియో!

ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందినట్లు చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నితిన్‌ సేఠీ అనే ఓ జర్నలిస్ట్‌ మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల చట్టంపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్నాడు.

ఇందులో అతడు కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు.ఈ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అవినీతిని బీజేపీ చట్టబద్ధం చేస్తోందని నితిన్‌ తేల్చాడు.

రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇవ్వాలంటూ 2017లో మోదీ సర్కార్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.అయితే దీనిని అడ్డం పెట్టుకొని బీజేపీ అక్రమంగా లబ్ధి పొందుతోందని, కాంగ్రెస్‌ కంటే ఎక్కువ అవినీతి చేస్తోందంటూ నితిన్‌ సేఠీ వెల్లడించిన విషయాలతో ఓ వీడియోను రూపొందించారు.

Nitin Concludes That Bjp Is Legalizing Corruption

ముఖ్యంగా పార్టీలకు విరాళం ఇచ్చిన వ్యక్తుల వివరాలు బయటకు చెప్పకపోవడం, విదేశీ కంపెనీలు కూడా విరాళాలు ఇవ్వొచ్చన్న నిబంధనలు ఈ అవినీతిని చట్టబద్ధం చేస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ.విదేశీ కంపెనీల విరాళాలు అంటే మనీలాండరింగ్‌ను పెంచినట్లే అవుతుందని ఆర్బీఐ అభ్యంతరపెట్టినా పట్టించుకోకుండా మోదీ సర్కార్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని నితిన్‌ సేఠీ ఆరోపిస్తున్నారు.దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందంటూ పార్లమెంట్‌ సాక్షిగా మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసిందట.

Advertisement
Nitin Concludes That Bjp Is Legalizing Corruption-ఉగ్రవాదుల�

పైగా కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాన మంత్రి కార్యాలయ ప్రోద్బలంతో అక్రమంగా ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరించి బీజేపీ లబ్ధి పొందినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఇక విరాళం ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలియవని ప్రభుత్వం చెబుతున్నా.

ఇందులోని ఓ కోడ్‌ ఆధారంగా ఆ వివరాలు తెలుసుకోవచ్చని కూడా నితిన్‌ సేఠీ తేల్చాడు.ఉగ్రవాదులకు నిధులు ఇస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సంస్థ నుంచి కూడా బీజేపీకి విరాళాలు వచ్చినట్లు కూడా నితిన్‌ ఆరోపించాడు.ఈ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా 2018లో పార్టీలకు రూ.6000 కోట్ల విరాళాలు రాగా.అందులో 95 శాతం బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.

ఈ బాండ్ల స్కీమ్‌ ప్రధాని మోదీకి, అమిత్‌ షాకు నేరుగా మేలు చేయకపోయినా.వాళ్లు దీని ద్వారా అక్రమంగా సంపాదించకపోయినా.

బీజేపీకి మాత్రం భారీగా లబ్ధి చేకూరుతోందని నితిన్‌ సేఠీ తేల్చి చెప్పారు.వైరల్‌ అవుతోన్న ఆ వీడియో లింక్‌ ఇదే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు