బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్ ను తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది.
అయితే హీరోయిన్స్ పాత్రల విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొని ఉంది.అది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఒరిజినల్ వర్షన్ లో రాధిక ఆప్టే పోషించిన పాత్రను నభా నటేష్ మరియు టబు పోషించిన పాత్రను తమన్నా చేయబోతుంది.టబు పాత్రకు గాను పలువురు స్టార్ హీరోయిన్స్ ను సంప్రదించారు.
నయనతారతో సంప్రదించగా ఆమె భారీ పారితోషికంను డిమాండ్ చేసింది.
టబు పాత్ర కోసం అనసూయను సైతం సంప్రదించారని వార్తలు వచ్చాయి.
కాని చాలా కీలకమైన పాత్రకు ఒక స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబందించిన అధికారిక ప్రటక వచ్చేసింది.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్ ను హీరోయిన్‌గా నటింపజేస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం చేస్తున్న రంగ్ దే సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మేర్లపాక గాంధీ ఒరిజినల్ స్టోరీని ఏమాత్రం చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు నితిన్ సోదరి నిఖితలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాను సమర్పించబోతున్నాడు.బాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన అంధాదున్ తెలుగులో కూడా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.