యూత్ స్టార్ నితిన్ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు తన కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేసాడు.
ఈ సినిమాను నితిన్31 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించ బోతున్నారు.
ఈ సినిమాను ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ సినిమా ప్రారంభోత్సవానికి వెంకీ కుడుముల, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి, బివిఎస్ఎన్ ప్రసాద్, మేర్లపాక గాంధీ అతిధులుగా వచ్చారు.
ఇక ఈ సినిమాలో మొదటి షాట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నితిన్ కృతి శెట్టి పై క్లాప్ కొట్టారు.ఇక ఈ రోజే ప్రారంభం అయినా ఈ సినిమా నుండి అప్పుడే అప్డేట్ రాబోతుంది.
ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు ఈ సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించ బోతుంది.ఇక ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి స్టార్ట్ కాబోతుంది.
ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 17 న ఓటిటి ద్వారా విడుదల అవ్వబోతుంది.ఇక ఈ సినిమాతో పాటు నితిన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
నితిన్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు సెట్స్ మీదకు తీసుకు వెళతాడో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy