ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు.ఎందుకంటే వైసీపీ వర్సెస్ నిమ్మగడ్ద అనేలా వార్ నడుస్తుంది.
ఈ విషయంలో ఏపీ సీయం జగన్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోక పోయిన, ఇతర వైసీపీ నేతలు మాత్రం నిమ్మగడ్దతో సై అంటే సై అని మాటల యుద్ధం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు నిమ్మగడ్డ పేరు చెబితే అమ్మో అనే పరిస్థితి నెలకొందట.
ఇలా నిమ్మగడ్డ దూకుడును చూస్తుంటే పరిషత్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాకే రిటైర్మెట్ తీసుకుంటారన్న భావనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.అందుకే వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను, పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని సమాచారం.
ఇక ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిమ్మగడ్డ మాత్రం స్థానిక ఎన్నికలు అనుకున్న సమయానికి నిర్వహిస్తున్నారు.

అందుకే విజయసాయిరెడ్డి కూడా వైసీపీ ముఖ్యనేతలు పార్టీ క్యాడర్‌ను అందుకు సన్నద్ధం చేస్తున్నారట.ముఖ్యంగా నిమ్మగడ్ద విషయంలో, విజయ సాయిరెడ్డికి పూర్తి క్లారీటి వచ్చిందంటున్నారు.అందుకే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఇదే విషయాన్ని తెలియజేస్తూ, ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది.
ఇకపోతే గత ఏడాది మార్చిలో జరిగిన పరిషత్ ఎన్నికల నామినేషన్లు, ఏకగ్రీవాలన్నీ రద్దుచేసి మళ్లీ మొదటి నుంచి పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారనే అనుమానంతో వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారట.మొత్తానికి విజయసాయిరెడ్డి నిర్ణయాల వెనక నిమ్మగడ్ద పుట్టించిన గుబులు ఉందని అనుకోని వారు లేరట.