కార్తికేయ 2( Karthikeya 2 ) తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ సినిమాతో వచ్చాడు.ప్రస్తుతం అతను చేసిన స్పై సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అయితే కార్తికేయ 2 ఎఫెక్ట్ తో నిఖిల్ ఖాతాలో క్రేజీ సినిమాలు వచ్చి చేరుతున్నాయి.ఇప్పటికే వి మెగా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చరణ్( Rama charan ) నిర్మాణ సారధ్యంలో ది ఇండియా హౌజ్ సినిమా అనౌన్స్ మెంట్ రాగా లేటెస్ట్ గా నిఖిల్ 20వ సినిమాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తుంది.
ఈ సినిమా కూడా ఫ్యాంటసీ మూవీగా రాబోతుందని తెలుస్తుంది.

నిఖిల్ 20వ సినిమా ఫస్ట్ లుక్ గురువారం రిలీజ్ కాబోతుంది.సినిమాను నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.
ఫ్యాంటసీ మూవీ అనగానే భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది.నిర్మాతలు ఈ సినిమా కోసం హ్యూజ్ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి కార్తికేయ 2 వల్ల నిఖిల్ తన రేంజ్ ని పెంచుకునే సినిమాలే చేస్తున్నాడని తెలుస్తుంది.చూస్తుంటే నిఖిల్ కూడా రానున్న ఈ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.







