భార్యతో సహా ఆ హీరో ఏం చేశాడంటే?

కరోనా వైరస్ కారణంగా గతేడాది నుండి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.అన్ని రంగాలు కూడా కరోనా ధాటికి అల్లాడిపోయాయి.

ముఖ్యంగా సినీ రంగం కరోనా దెబ్బకు గతేడాది నుండి కోలుకోలేకపోయింది.ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు.

Nikhil In Self Lockdown Along With Wife, Nikhil, Pallavi, Lockdown, Tollywood Ne

చాలా మంది కోలుకున్నారు కూడా.అయితే తాజాగా ఓ హీరో తన భార్యతో సహా ఏం చేశాడో తెలిస్తే మీరు వారిని అభనందించడం ఖాయం.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి సెల్ఫ్ లాక్‌డౌన్‌ను విధించుకున్నాడు.కరోనా సమయంలో ఎలాంటి ఆర్భాటలు చేయకుండా ఉండాలని గతంలో నిఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక లాక్‌డౌన్‌లోనే తన పెళ్లి కూడా చేసుకున్నాడు ఈ కుర్ర హీరో.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా అనవసరంగా బయట కాలుపెట్టకూడదని నిఖిల్ నిర్ణయించుకున్నాడు.

తన భార్య పల్లవిని కూడా బయటకు పంపేందుకు ఆయన ఒప్పుకోవట్లేదట.దీంతో వారిద్దరు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.

అత్యవసరమైతేనే బయటకు రావాలని వారు ప్రజలకు, తన అభిమానులకు తెలిపాడు.కరోనా బారినుండి మనల్ని మనమే కాపాడుకోవాలంటే ఇంట్లో ఉండటం ఒక్కటే మార్గమని ఆయన అన్నాడు.

ఇలా ఓ హీరో తన భార్యతో సహా సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకోవడం మెచ్చుకోదగ్గ విషయమని అందరూ అంటున్నారు.కరోనా నుండి అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే, జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, పటిష్టమైన ఆహారం కూడా తీసుకోవాలని నిఖిల్ అంటున్నాడు.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

ఇక మిగతావారు కూడా తమలాగా సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకుని వీలైనంత వరకు బయటకు అడుగుపెట్టకుండా ఉంటే మంచిదని ఆయన అంటున్నారు.ఇక ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న 18 పేజీస్, కార్తికేయ 2 చిత్రాల షూటింగ్‌ను ఆయన వాయిదా వేశారు.

Advertisement

దీంతో తన సినిమాల షూటింగ్‌ల గురించి త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తానని నిఖిల్ అంటున్నాడు.

తాజా వార్తలు