ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ ( Niharika NM )గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మకు 34 లక్షల పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఈ తార ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది.గీతా ఆర్ట్స్ నిర్మాణంలో( Geetha Arts ) రానున్న ఓ సినిమాలో ఆమె ఒక మంచి ఆఫర్ పొందండి దాంతో లెక్కంటే ఆమెదే అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ బర్త్ డే (జులై 4న) శుభాకాంక్షలు తెలుపుతూనే ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వెల్‌కమ్ చెప్పింది.అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ నక్కతోక తొక్కిందని వార్తలు రాస్తున్నారు కానీ నిహారికకు అంత సీన్ ఏమీ లేదని తెలుస్తోంది.
ఎందుకంటే ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలను కెరియర్ గ్రోత్ కి ఉపయోగించుకోవాలని తెలివి లేదు.ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూస్తే రకరకాల రంగాలలో ఆమె దూకేస్తుంది తప్ప అందులో స్థిరపడడం లేదని తెలుస్తుంది.
అందువల్ల ఆమె పెద్ద బ్యానర్లో అవకాశం దక్కించుకున్నా ఆ తర్వాత సినిమాల్లో కొనసాగుతుందని చెప్పలేం.
ఈ తార తెలుగు కంటే ముందే తమిళంలో ఓ సినిమా ఛాన్స్ పట్టేసింది.ఇప్పుడు అందులో నటిస్తోంది.ఆమెకు చాలానే సినిమా అవకాశాలు వస్తుంటాయట.
వాటిలో ఏది నచ్చితే అది చేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది.గోల్డెన్ చాన్స్ వచ్చిందంటూ పొంగిపోయే కేరక్టర్ కాదామె.
ఈ ముద్దుగుమ్మ బెంగుళూరు, తెలుగు మూలాలు కలిసిన అమ్మాయి.ఆమె వీడియోల్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తుంది.
చెన్నైలో పుట్టినా ఇప్పుడు ముంబైలోనే సెటిల్ అయ్యింది.చదువులో బాగానే రాణించింది.
ఇంజనీరింగ్ పూర్తి చేసింది.కాలిఫోర్నియాలోని ఓ యూనివర్శిటీలో ఎంబీఏ ( MBA from a university in California )కంప్లీట్ చేసి గూగుల్‌లో ఉద్యోగం చేసింది.
దానితో సంతృప్తి చెందక ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి, సరదా వీడియోలు పోస్ట్ చేయడం మొదలెట్టింది.
అయితే ఆమె వీడియోలకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.చాలా పాపులర్ అయింది.ఇక అప్పటినుంచి సోషల్ మీడియాను దున్నేయడం ప్రారంభించింది.
ఒక్క ఇన్‌స్టాలోనే కాకుండా ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో కూడా బాగా ఫాలోవర్స్ ని సంపాదించింది.సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా హిందీ, తెలుగు సినిమాలకు ప్రమోషనల్ రీల్స్ చేస్తుంటుంది.
కొద్ది రోజుల క్రితం మహేశ్ బాబు కోసం కూడా ఓ యాడ్ చేసి ఆకట్టుకుంది.కాఫీ విత్ కరణ్ షో, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ వంటి ప్రముఖ షోలలో కూడా మెరిసింది.
ఈ ముద్దుగుమ్మ రొటీన్ లైఫ్ ను అసలు ఇష్టపడదు.టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు వెరైటీ పాత్రలు ఇస్తేనే ఇక్కడ ఉంటుంది లేదంటే చెక్కేస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy