టాలీవుడ్ నటి, నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల( Niharika Konidela )మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.కానీ ఈమెకు వెండితెరపై అంతగా కలిసి రాలేదు.
కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.ఇక ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.
చాలావరకు అవకాశాల కోసం ప్రయత్నించింది కానీ ఈ అమ్మడును దర్శక నిర్మాతలు ఎవరు పట్టించుకోలేదు.దీంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
పలు వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.గతంలో తన తండ్రి తీసుకొచ్చిన సంబంధమైన జొన్నలగడ్డ చైతన్య( Chaitanya Jv )ను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది.
పెళ్లి తర్వాత నిహారిక లో చాలా మార్పులు వచ్చాయి.చాలావరకు యాక్టివ్ గా మారింది.వ్యక్తిగత విషయంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.ముఖ్యంగా తన వేషధారణ పూర్తిగా మార్చేసింది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.
తన భర్తతో బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేసింది.అయితే ఓ సారి ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కగా ఆ సమయంలో అత్తింటి పరువు తో పాటు తండ్రి పరువు కూడా తీసింది.ఇక ఆ అవమానాలు తట్టుకోలేక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది.
మళ్ళీ అన్ని మర్చిపోయి సోషల్ మీడియాలో అడుగుపెట్టి అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను ఆ రేంజ్ లో షేక్ చేసింది.
పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది.ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.
అయితే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.అంతేకాకుండా తనకు తన భర్తకు మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయని.
దీంతో వీరిద్దరి విడిపోతున్నారు అని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.
పైగా వీరిద్దరి సోషల్ మీడియా( Social media )లో ఒకరికొకరు అన్ ఫాలో అయ్యారని.
ఇక తన భర్త ఈమెతో దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశాడు అని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం గురించి నిహారిక గాని, నాగబాబు కానీ స్పందించకపోయేసరికి ఇందులో నిజం ఉందని చాలామంది అనుకుంటున్నారు.
అయితే చాలా రోజుల తర్వాత నిహారిక తన సోషల్ మీడియా వేదికగా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పంచుకుంది.ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కాంప్లిమెంట్ ఇవ్వడం పక్కకు పెట్టి విడాకుల గురించి తీసి నిహారికను బాగా కడిగి పారేస్తున్నారు.
మంచి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని కామెంట్ చేస్తున్నారు.మీరు నిజంగానే విడాకులు తీసుకున్నారా అంటూ కొందరు అనుమానంతో అడుగుతున్నారు.
కోట్లు పెట్టి పెళ్లి చేసుకోవాలి మళ్లీ విడిపోవాలి అంటూ ఏంటో జీవితాలు అని అంటున్నారు.