మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గాను అలాగే హీరోయిన్ గాను సందడి చేసినటువంటి వారిలో మెగా డాటర్ నిహారిక( Niharika Konidela )ఒకరు.అయితే ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా మారారు.
అయితే తన పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పాలి.ఇలా తన భర్తతో విడాకులు( Divorce )తీసుకున్న తర్వాత నిహారిక తన ఫోకస్ మొత్తం సినిమాల పైన పెట్టారు.
ఈ క్రమంలోనే వరుస సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె తన స్నేహితులతో కలిసి కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇలా తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే నిహారిక మెగా కుటుంబానికి ( Mega Family )దూరంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన స్నేహితులందరూ కూడా తనకు సెండాఫ్ ఇస్తూ ఎయిర్ పోర్టులో తనని డ్రాప్ చేసినటువంటి వీడియోలను ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.అయితే ఇలా ఉన్నఫలంగా నిహారిక మెగా కుటుంబం నుంచి విదేశాలకు వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.త్వరలోనే తన అన్నయ్య పెళ్లి పెట్టుకొని నిహారిక ఇలా మెగా కుటుంబానికి దూరం కావడానికి కారణం ఏంటి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నిహారిక విడాకుల తర్వాత పూర్తిగా తన ఫోకస్ మొత్తం సినిమాల పైన( Niharika Movies ) పెట్టారు.దీంతో సినిమాలకు సంబంధించి ఏదైనా శిక్షణ తీసుకోవడం కోసం విదేశాలకు వెళ్లారా లేకపోతే ఉన్నత చదువులు చదవడం కోసమే విదేశాలకు వెళ్లారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విధంగా నిహారిక విదేశాలకు వెళ్లడంతో ఈమె ఇలా వెళ్లడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సింది.ఒకవేళ వెకేషన్ కి అయితే తప్పకుండా స్నేహితులతో కలిసి ఈమె వెళ్లేవారని ఒంటరిగా వెళ్తున్నారు అంటే బహుశా ఏదైనా శిక్షణ తీసుకోవడం కోసమే వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మరి నిహారిక ఇలా ఫారిన్ వెళ్లడానికి గల కారణం తెలియాల్సి ఉంది.