1.
ఈడీ విచారణకు కవిత న్యాయవాది
ఎమ్మెల్సీ కవిత న్యాయవాది సోమ భరత్ నేడు మరోసారి ఈడి కార్యాలయానికి వెళ్లారు.ఈరోజు కవిత మొబైల్ ఫోన్లను తెరిచేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.దీనిలో భాగంగానే ఫోన్లను ఓపెన్ చేసేటప్పుడు కవిత స్వయంగా హాజరు కావడం, లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా ఈడీ పేర్కొనడంతో సోమ భరత్ హాజరయ్యారు.
2.
టిడిపి ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యాదృచ్ఛికంగా పాల్గొన్నారు.
3.
యువ గళం పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికీ 54 రోజుకు చేరుకుంది.
4.
జగన్ పై లోకేష్ విమర్శలు
ఉద్యోగులు ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు చెల్లించలేని దివాలా కోరు, అసమర్థ జగన్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
5.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఈరోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీ కల్లా వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది.
6. టిడిపికి వైసీపీ ఎమ్మెల్యే సవాల్
వైసిపి ఎమ్మెల్యేలు 40 మంది తమతో టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు చేస్తున్న కామెంట్స్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు.దమ్ముంటే ఆ నలభై మంది పేర్లను బయట పెట్టాలంటూ ఆయన సవాల్ విసిరారు.
7.కేంద్రంపై శాసనమండలి చైర్మన్ విమర్శలు
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారని, ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,151 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
9.రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేళ్ల జైలు
ఇటీవల వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కఠిన చర్యలకు దిగింది .ఇకపై రైళ్ల పై రాళ్లతో దాడికి పాల్పడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది.
10.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాదులో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఉదయం 11 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి ఆనంద్ తెలిపారు.
11.
గన్నవరం నుంచి కువైట్ కు విమానం
గన్నవరం నుంచి కువైట్ కు నేరుగా విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం కాబోతోంది.
12.
వైసిపి ఎమ్మెల్యే ఆర్ధర్ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఓటు వేసేందుకు ఆ పార్టీ నుంచి నాకు ఆఫర్ వచ్చిందని వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
13.
నేడు ఢిల్లీకి జగన్
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
14.
టిడిపి ఆవిర్భావ సభ
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టిడిపి ఆవిర్భావ సభ జరగనుంది.
15.
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది.రేపు సాయంత్రం హనుమంత వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
16.
భద్రాచలం సమాచారం
నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.రేపు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు.
17.
మెగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా అర్ధవీడులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
18.
కిసాన్ మేళ
మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
19.
అన్నవరంలో శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం సత్యదేవుని ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి.
20.
హర్యానా గవర్నర్ పర్యటన
నేడు బాపట్ల జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటిస్తున్నారు.
మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
19.
అన్నవరంలో శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం సత్యదేవుని ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి.
20.
హర్యానా గవర్నర్ పర్యటన
నేడు బాపట్ల జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటిస్తున్నారు.