న్యూస్ రౌండప్ టాప్ -20

1.

కవితపై అరవింద్ ట్వీట్

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.ఏనాడు తలవంచని తెలంగాణ నీవల్ల తలవంచుతోంది అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడంపై అరవింద్ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.

 News Roundup Top 20 ,kavitha, Kcr, Ktr, Telangana Jagan,bjp, Delhi Likker Scam,-TeluguStop.com

2.

ఈడి కి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం పై ఆమె వివరణ ఇచ్చారు .ఈనెల 9న విచారణకు హాజరు కాలేను అని, 15 తర్వాత విచారణకు హాజరవుతానని కవిత లేక రాశారు.

3.

కవిత పై బండి సంజయ్ కామెంట్స్

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.తెలంగాణ పరువును కవిత తీశారు అంటూ సంజయ్ విమర్శించారు.

4.

కవితా కెసిఆర్ పై షర్మిల విమర్శలు

బంగారు తెలంగాణలో ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని, సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఒక ఆడదే ఉండి, సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్ చేశారని కవితపై షర్మిల మండిపడ్డారు.

5.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీం లో భాగంగా ‘అగ్ని వీర్ వాయు ‘ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

6.

మహిళలకు లోకేష్ పాదాభివందనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి యువ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.పీలేరు నియోజకవర్గంలో ఈరోజు మహిళలతో ముఖాముఖి సమావేశమైన ఆయన ఈ సందర్భంగా మహిళలకు పాదాభివందనం చేశారు.

7.

జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.

8.

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

9.

కేసిఆర్ పై కేంద్ర మంత్రి కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు ఈడీ కేసులు నీతిమంతులు అయితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

10.

ఉద్యమాన్ని కొనసాగిస్తాం

ఏపీలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు తాజాగా సిఎస్ జవహర్ రెడ్డిని కలిశారు.నిన్నటి చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యచరణను కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

11.

బిజెపికి దర్యాప్తు సంస్థలతో సంబంధం లేదు

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

బిజెపికి దర్యాప్తు సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

12.

ఏపీలో 13న ఎన్నికల పోలింగ్

ఏపీలో ఈనెల 13వ తేదీన టీచర్ పట్టభద్రులు ఎన్నికల పోలింగ్ జరగనుంది.

13.

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

14.

జగన్ పై బిజెపి విమర్శలు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.

15.

వైఎస్ షర్మిల అరెస్ట్

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై వైఎస్ ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు.5 దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.అలాగే ఈ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

16. 

నీటిపై నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

భారత నౌకాదళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్ సాంకేతిక సమస్య ఏర్పడడంతో అత్యవసరంగా నీటిపై దించారు ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.

17.

సత్యదేవుని వ్రతానికి సాంప్రదాయ వస్త్ర ధారణ తప్పనిసరి

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం నిత్య కళ్యాణం ఇతర పూజలకు భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలని నిబంధనలను నిన్నటి నుంచి అమలు చేస్తున్నారు.

18.

శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర పంచాంగం విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర పంచాంగం ను ఈవో ఏవి ధర్మారెడ్డి విడుదల చేశారు.

19.

తెలంగాణలో ఆరోగ్య మహిళా పథకం ప్రారంభం

Telugu Ap, Bandi Sanjay, Cmjagan, Cm Kcr, Cpinational, Scheme, Kavitha, Harish R

మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళ పథకాన్ని కరీంనగర్ లో ప్రారంభించారు.

20.

ఈరోజు బంగారం ధరలు

22

క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,000

24

క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,630

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube