ఫ్యాషన్ పేరుతో ఫారినర్స్ వేసుకుంటున్న దుస్తులను చూసి సామాన్యులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులతో కూడా డ్రెస్సులు కుట్టుకుని అదే అద్భుతమైన ఫ్యాషన్( Fashion ) అని కొందరు డిజైనర్లు చెప్తుంటే సామాన్యులు నోరెళ్ల బెట్టక తప్పడం లేదు.
తాజాగా ఒక డిజైనర్ బియ్యం, ఇంకా ఇతర సరుకులను స్టోర్ చేసే గోనె సంచులతో జాకెట్ కుట్టాడు.పైగా దాని ధరను రెండు లక్షలు గా నిర్ణయించాడు.
ఈ వింత డ్రెస్సు తయారీకి సంబంధించిన వీడియో వైరల్ కాగా దీన్ని చూసి నెటిజన్లు కంగుతింటున్నారు.

వివరాల్లోకి వెళ్తే, న్యూయార్క్‌కు( Newyork ) చెందిన ఓ డిజైనర్ ఏ వస్తువు నుంచైనా సరికొత్త డ్రస్సులను తయారు చేయగలడు.తాజాగా అతను గోనె సంచిని అల్ట్రా మోడ్రన్ జాకెట్‌గా( Ultra Modern Jacket ) మార్చాలని నిర్ణయించుకున్నాడు, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు కొన్ని సంచులను కలెక్ట్ చేసి డిజిహీట్ అనే హీట్ మెషిన్‌తో వాటిని వేడి చేశాడు.350 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్ వద్ద వాటిని వేడి చేయడం వల్ల అవి తయారయ్యాయి.ఆపై వాటిని జాకెట్‌గా కుట్టేశాడు.దానిని ట్రెండీ జాకెట్( Trendy Jacket ) అని పిలుస్తూ షాక్ ఇచ్చాడు.

వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయని పెద్ద జాకెట్ 2,400 డాలర్లు (దాదాపు రూ.2 లక్షలు)కు విక్రయిస్తానని, మిగతావి 1,400 డాలర్లు (దాదాపు రూ.1.16 లక్షలు), దాదాపు 750 డాలర్లకు (దాదాపు రూ.62,000) అమ్ముతానని అతను చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు.ఈ వీడియో చూసి దానిని రూ.100 కు కూడా ఎవరూ కొనరు అని చాలామంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇదెక్కడి పైత్యం ఇలాంటివి మేం అసలు ఎంకరేజ్ చేయమని మరికొందరు అన్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







