జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన లైనప్ లో కూడా భారీ ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి.ఆర్ఆర్ఆర్ వంటి ఒకే ఒక్క సినిమాతో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజీ లైనప్ సెట్ చేసుకోగా అందులో ”దేవర” సినిమా ఒకటి.
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుంటే హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఎన్టీఆర్ సరసన ఆడిపాడబోతుంది.విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు.

మరి స్టార్ క్యాస్ట్ ను తీసుకున్న కొరటాల ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా నుండి ఒక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్ మినహా పెద్దగా అప్డేట్స్ ఇంకా రాలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరి 1న అంటే న్యూ ఇయర్ కు( New Year ) ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.న్యూ ఇయర్ రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా టీజర్( Devara Teaser ) అప్డేట్ ఇవ్వనున్నారట.ఆ వారాంతంలోనే టీజర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.
చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో.
కాగా ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.







