వాట్సప్…( Whatsapp ) ఒకప్పుడు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే ఉపయోగించేవారు.కానీ ఆ తర్వాత అనేక ఫీచర్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు పంపుకోవడంతో పాటు బ్యాంకు పేమెంట్స్ లాంటివి వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి.కానీ వాటిని వాడేవాళ్లు చాలా తక్కువనే చెప్పుకోవాలి.
ఈ యాప్‌కు రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్ల ఉన్నారు.
అయితే గత కొన్ని నెలలుగా వాట్సాప్ కొన్ని ఫీచర్లను ( Whatsapp Features ) అప్‌డేట్ చేస్తూ వస్తోంది.దీంతో ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ గా కొనసాగుతోంది.తాజాగా వాట్సాప్ లో మనం పంపే మెసేజ్ లలో( Whatsapp Messages ) కొత్తఫార్మాట్లను వాట్సప్ తీసుకొస్తుంది.
కోడ్ బ్లాక్ , కోట్ బ్లాక్, లిస్ట్స్ అనే ఫీచర్లను తీసుకొచ్చింది.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రోగ్రామర్ల కోసం దీనిని రూపొందించారు.వాట్సాప్‌లో కోడ్‌లను( Code Block ) షేర్ చేసేందుకు, చదివేందుకు అనుకూలంగా ఉండేలా దీనిని తయారుచేశారు.ఈ టూల్ ను వాడేందుకు ‘బ్యాక్‌టిక్ క్యారెక్టర్’ అవసరం.
ఇక కోట్ బ్లాక్( Quote Block ) ఫీచర్ విషయానికొస్తే.ఏదైనా మెసేజ్ లోని నిర్దిష్ట భాగానికి స్పెషల్ గా ఆన్సర్ ఇవ్వడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది.‘>’ అనే సింబల్ ను ఉపయోగించడం ద్వారా ఈ ఫార్మాటింగ్ టూల్ ను ఉపయోగించవచ్చు.ఇక మనకు వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లను క్రమపద్ధతిలో నిర్వహించడానికి ‘లిస్ట్స్’( Lists ) టూల్ ఉపయోగించుకోవచ్చు.
మెసేజ్ లకు ముందు ‘నక్షత్రం గుర్తు’ లేదా ‘హైఫన్’ ఉండేలా మనం సెట్టింగ్స్ చేయొచ్చు.ఈ ఫీచర్లు యూజర్లను ఎంతో ఆకట్టుకోనున్నాయిన చెప్పవచ్చు.ప్రస్తుతం అతి కొద్దిమందికే టెస్టింగ్ కోసం వీటిని రిలీజ్ చేసింది.కొంతమందికి ఐవోఎస్ 23.21.1.75 వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ కొత్త టూల్స్ ను విడుదల చేశారు.