మెగాస్టార్ 150వ చిత్రంలో కొత్త ట్విస్ట్

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంలో కొత్త ట్విస్ట్ వచ్చిపడింది.తమిళంలో భారి బ్లాక్బస్టర్ గా నిలిచిన కత్తి చిత్రాన్ని మెగాస్టార్ తన 150వ చిత్రంగా రీమేక్ చేస్తారని స్వయంగా రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 New Script Getting Readied For Chiranjeevi 150th-TeluguStop.com

కత్తి తెలుగు వెర్షన్ కి సంబంధించిన స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయ్యింది.ఇప్పుడు కొత్త ట్విస్టు ఇచ్చారు మెగాస్టార్.

ప్రస్తుతం ఉన్న రీమేక్ స్క్రిప్టు కాకుండా, కొత్త కథ ఒకటి రాసుకు రమ్మని వివి వినాయక్ కి చెప్పారట.మెగాస్టార్ చెప్పాకా ఇంకేం చేస్తారు, సరే రాసుకోస్తాను అని సమాధానమిచ్చారు వివి వినాయక్.

ఇప్పుడు వివి వినాయక్ రైటింగ్ టీమ్ ఇటు కత్తి స్క్రిప్టు మీద పనిచేస్తూనే, సైలెంట్ గా కొత్త స్క్రిప్టు పనులు కూడా మొదలుపెట్టింది.ఈ రెండు స్క్రిప్టులు పూర్తయ్యాక, ఏ కథని సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి అనేది మెగాస్టార్ ఇష్టం.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే, మే లేదా జూన్ నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్ చరణ్, లికా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ప్రస్తుతానికైతే, నయనతార, అనుష్కలలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube