Suzuki Burgman Street 125EX : సుజుకి నుంచి కొత్త స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లివే!

ప్రముఖ టూవీలర్ తయారీదారు మారుతీ సుజుకి ఇండియాలో సరికొత్త స్కూటర్‌ని లాంచ్ చేసింది.దానిని బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ పేరుతో తీసుకువచ్చింది.

ఈ సరికొత్త స్కూటర్‌ని బర్గ్‌మన్ స్ట్రీట్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రిలీజ్ చేసింది.ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తోపాటు ప్రీమియర్ లుక్‌ను ఆఫర్ చేసారు.ఈ స్కూటర్ ధర రూ.1,12,300(ఎక్స్‌షోరూమ్) అని కంపెనీ ప్రకటించింది.మారుతీ సుజుకి బర్గ్ మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ.89,900, సుజుకి బర్గ్ మన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.93,300 పలుకుతుంది.ఈ స్కూటర్లు మెటలీక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటలీక్ రాయల్ బ్రాంజ్, మెటలీక్ మ్యాట్ బ్లాక్ లాంటి కలర్ ఆప్షన్ లో లభ్యమవుతున్నాయి.

సుజుకి బర్గ్ మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజన్ ఫీచర్లు తెలుసుకుంటే.ఈ స్కూటర్ ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఏకో పర్ఫామెన్స్ ఆల్ఫా ఇంజన్‌తో వస్తుంది.దీనిలో 124సీసీ మోటార్‌ని అమర్చారు.ఇది 8.6 బీహెచ్‌పీ పవర్, 10 Nm మాక్సిమమ్‌ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఇందులో ఆటో స్టాఫ్-స్టార్ట్ సిస్టమ్, సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ఇవ్వడం విశేషం.

స్కూటర్‌కి వెనుక భాగంలో 12 అంగుళాల వెడల్పైన టైర్ అమర్చారు.

New Scooter Launch From Suzuki Price, Features Suzuki Scooter, New Scooter, Bu
Advertisement
New Scooter Launch From Suzuki Price, Features! Suzuki Scooter, New Scooter, Bu

సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్‌తో కూడిన సుజుకి రైడ్ ఫీచర్‌తో లాంచ్ అయింది.ఈ బైక్ డిస్‌ప్లేలో ఇన్‌కమింగ్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్, ఎస్ఎంఎస్‌లు చూసుకోవచ్చు.అలానే స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్‌ని కూడా డిజిటల్ కన్సోల్‌లో చూసుకోవచ్చు.

ఈ స్కూటర్ కన్సోల్‌కి బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌ని కనెక్ట్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు