నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్

ప్రస్తుతం హీరో నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.

ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ముగిసినట్లు సందర్భంగా యూనిట్ సభ్యులు ఫోటోకు ఫోజు ఇచ్చి సోషల్ మీడియాలో వదిలారు.

ఈ సినిమాలో హీరో నాగ చైతన్య సరసన హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బంధం.

నేడు హీరో నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త పోస్టర్ ను విడుదల చేసారు.ఈ పోస్టర్ లో నాగచైతన్య ఓ పక్కా పల్లెటూరి యువకుడిలా కనబడుతూ మంచి ఫోజ్ ఇచ్చాడు.

పోస్టర్ లో నాగచైతన్య బనియన్, లుంగీ ధరించి కనబడుతున్నాడు.ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, తొలిపాట ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.

Advertisement

ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ యాస లో హీరో హీరోయిన్లు సంభాషించబోతున్నట్లు సమాచారం.లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ మధ్యకాలంలో తనదైన శైలిలో నాగచైతన్య కథలను ఎంచుకుంటూ మంచి దూకుడు మీద ఉన్నాడు.మజిలీ సినిమా తర్వాత నాగచైతన్య కథ ఎంచుకోవడంలో కాస్త విభిన్నంగా ఆలోచిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఈ సినిమా తర్వాత నాగేశ్వరరావు, బంగార్రాజు సినిమాల్లో నాగచైతన్య నటించబోతున్నారు.ఈ రెండు సినిమాలు మాత్రమే కాక మరో సినిమా కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు.అలాగే దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ సినిమాకు సంబంధించి తాజాగా థాంక్యూ అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఏది ఏమైనా లవ్ స్టోరీ లో తెల్ల బనియన్, పంచ తో నాగచైతన్య అక్కినేని చూడటానికి అచ్చం పల్లెటూరి వ్యక్తి గా కనిపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు