అమెరికా: అది మారణహోమం.. 1984 సిక్కు అల్లర్లపై న్యూజెర్సీ స్టేట్ సెనేట్ తీర్మానం

1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని.ఆమె బాడీగార్డులు సత్వంత్‌ సింగ్‌, బీంత్‌ సింగ్‌ కాల్చి చంపారు.

ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీతో పాటూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.

ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.

Advertisement

ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీ సెనేట్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఖండించింది.దానిని మారణహోమంగా అభివర్ణించింది.

సిక్కు కాకస్ కమిటీకి చెందిన యద్వీందర్ సింగ్, ప్రీత్‌పాల్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్‌లు ఈ తీర్మానాన్ని రాష్ట్ర సెనేట్ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు సిక్కు కాకస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

సెనేటర్ స్టీఫెన్ స్వీనీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.హిందూ సభ్యురాలు వీణు గోపాల్ దీనికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం.

ఇందిరాగాంధీ హత్య తర్వాత నవంబర్ 1,1984న సిక్కుల ఊచకోత ప్రారంభమైందని .మూడు రోజుల పాటు అనేక రాష్ట్రాల్లో సిక్కులను దారుణంగా హత్య చేశారని తీర్మానంలో పేర్కొన్నారు.అంతకుముందు కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ 2015లోనే ఢిల్లీలో సిక్కు అల్లర్లపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అనంతరం 2018లో పెన్సిల్వేనియా అసెంబ్లీ సైతం 1984 సిక్కు అల్లర్లలను మారణహోమంగా అభివర్ణించింది.తాజాగా న్యూజెర్సీ ఆమోదించిన తీర్మానం ప్రకారం.నాటి అల్లర్లలో ప్రాణాలతో బయటపడిన వారు అమెరికాకు వలస వచ్చారు.

Advertisement

ఫ్రెస్నో, యుబా సిటీ, స్టాక్ టన్, ఫ్రీమాంట్, గ్లెన్ రాక్, పైన్ హిల్, కార్టెరెట్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో సిక్కులు స్థిరపడ్డారని పేర్కొన్నారు.అమెరికా, న్యూజెర్సీలోని సిక్కు సమాజం నాటి మారణహోమం భౌతిక నష్టాల నుంచి కోలుకుందని.

కానీ ఆత్మీయుల జ్ఞాపకాలను వారు ఎన్నటికీ మరచిపోలేరని తీర్మానంలో ప్రస్తావించారు.

" autoplay>

తాజా వార్తలు