కొత్త ఇంటిని కొనుగోలు చేసి సంతోషించారు.. కానీ గోడ బద్దలుకొట్టి చూడగా షాక్...

పాత ఇల్లు లేదా బంగ్లాలు కూల్చేసే సమయంలో పురాతన నాణేలు, బంగారు వస్తువులు బయటపడటం మనం చూస్తూనే ఉంటాం.

ఒకోసారి ఆ గోడల మధ్య పాములు, కొండ చిలువలు లాంటివి బయటపడటం కూడా చూసాం.

ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇల్లు కొనుక్కున్నందుకు ఎంతో సంతోషం గా ఉన్న ఒక జంట ఆ ఇంటి గోడలు( Walls ) పగలుకొట్టిన తరువాత బయటపడ్డ వస్తువులు చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.

ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అసలు విషయంలోకి వెళ్తే.న్యూజెర్సీలోని( New Jersey ) ఒక జంట కొన్నాళ్ల క్రితం ఒక ఇంటిని( Home ) కొనుగోలు చేసింది.కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న తర్వాత సడన్‌గా ఆ ప్రాంతంలో వరదలు ( Flood ) రావడం వల్ల వారు ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement

వరదలు కాస్త తగ్గిన తర్వాత మళ్లీ ఆ జంట ఇంటికి చేరుకున్నారు.ఇల్లు మొత్తం బురదతో నిండిపోవడంతో ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు.ఈ క్రమంలోనే అండర్‌గ్రౌండ్‌లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఆ దంపతులు ఇద్దరూ బురదను క్లీన్ చేస్తుండగా గోడల మధ్య ఏదో ఉన్నట్లు వారికి అనుమానం వచ్చింది.గోడల మధ్యలో ఏమైనా మణులు, మాణిక్యాలు ఉన్నాయేమోనని ఇద్దరు సంతోషపడ్డారు.

అదే ఆనందంతో గోడలను పగలగొట్టించారు.కానీ ఆ గోడల మధ్యలో ఖాళీ రమ్ము సీసాలు( Empty Rum Bottles ) ఉన్నాయి.అవి వేల సంఖ్యలో ఉండగా తీసేకొద్దీ గుట్టలు గుట్టలుగా కనిపించాయి.

దాంతో షాక్ అవడం వారివంతయ్యింది.ఇలాంటి అనుభవం మీలో ఎవరికైనా ఎదురయిందా అంటూ ఆ జంట ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

వారి పోస్ట్ చూసిన నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.ఇదేం ఇల్లు అయ్యా బాబోయ్‌ మందు బాటిల్స్ తో గోడ కట్టేసారుగా అని ఒక నెటిజన్ ఫన్నీగా వ్యాఖ్యానించాడు.

Advertisement

ఎన్ని సీసాలు ఎక్కడినుంచి పట్టుకొచ్చారని ఇంకొందరు కామెంట్స్ చేశారు.

తాజా వార్తలు