గత సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ ( TTD )కథ ముగిసిందని , ఇక అది ఒక గడిచిన అధ్యాయమని చాలా మంది ఒక అంచనాకు వచ్చేశారు.దానికి కారణం అప్పటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ( YCP ) 151 సీట్లతో అధికారం దక్కించుకోగా టీడీపీ కి 23 స్థానాలలో మాత్రమే విజయం వరించింది.
చరిత్రలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు గెలుచుకున్నారు.ఈ ఫలితాలతో ఢీలా పడ్డ తర్వాత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) కానీ ఆ పార్టీ ముఖ్య నాయకులు కానీ పెద్దగా ప్రభావితం చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వ వ్యతిరేఖ నిరసన కార్యక్రమాలు కానీ చెయ్యలేదు.
అసెంబ్లీ లో కూడా బలమైన ప్రతిపక్ష గళం వినిపించలేకపోయారు.అలాంటి పరిస్థితి లో ఉన్న పార్టీ ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో మూడుకు మూడు గెలవడమే కాకుండా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ కు మెజారిటీ లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్సీ గెలుపొందారు.
నిజంగా ఇది ఒక రికార్డు.

అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక రాజకీయ విధానాలు ,పార్టీ అధిష్టానం ఒంటెద్దు పోకడలు ,నియంతృత్వ ధోరణి లాంటి విషయాల పై ఇప్పటికే అసంతృప్తి గా ఉన్న వైసీపీ నేతలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మరో అడుగు ముందుకు వేసి తమ వ్యతిరేకత ను తెలియచేశారు.ఈ విషయం అధికార పార్టీ కి గొడ్డలి పెట్టు.మరి దీనిపై వైసీపీ ఎలా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపడుతోందో చూడాలి.

అయితే ప్రతిపక్ష టీడీపీ కి మాత్రం ఇది సంతోషించాల్సిన సమయం తో పాటు అత్యంత కీలకం గా వ్యవహరించాల్సిన తరుణం.ఇంత తక్కువ వ్యవధిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికల రూపం లో రెండు సార్లు బహిర్గతమవ్వడం ప్రతిపక్ష పార్టీ బలం గా ఉపయోగించుకోవాల్సిన వజ్రాయుధం.ఈ విషయాన్ని ఎంత బలం గా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ వ్యతిరేకత ను ప్రజా వ్యతిరేకత గా మార్చుకుంటారు అన్న దానిపైనే టీడీపీ భవితవ్యం ఆధారపడి ఉంది.అయితే ఇప్పటి వరకూ టీడీపీ లో జరిగిన పరిణామాలు గమనిస్తే ప్రభుత్వం పై బలమైన విమర్శలు ,తీవ్ర స్థాయి లో నిరసన కార్యక్రమాల నిర్వహణ పైన కంటే నారా లోకేష్ ను పార్టీ భవిష్యత్ గా చిత్రీకరించడం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది.
మరి ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మళ్ళీ అధికారం దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.