అంతర్వేది రథం సిద్దం ! నేడే ట్రయల్ రన్

గడిచిన సెప్టెంబర్ లో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతి అయిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

అధికార ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించారు.అధికార పార్టీనే ఆలయాల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని ప్రతిపక్ష పార్టీ టి‌డి‌పి ఆరోపణలు చేసింది.40 అడుగుల ఎత్తు ఉండే ఈ రథం 60 ఏండ్ల కిందట లక్ష్మినరసింహ స్వామి వారి కల్యాణోత్సవం కోసం నిర్మించారు.ఈ రథం కాలీ బూడిద అవ్వడంతో ప్రభుత్వం కొత్త రథ నిర్మాణం చేపట్టింది.

మూడు నెల్లలోనే రథ నిర్మానాని పూర్తి చేసింది.నేడు ఈ రథానికి ట్రయల్ రన్ వెయ్యనున్నారు.ఏమైనా లోపాలు ఉంటే సరిచేయ్యనున్నారు.

కొత్త అంతర్వేది రథం యొక్క ట్రయల్ రన్ మంత్రి వేణుగోపాల కృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆద్వర్యంలో జరగనున్నది.మరో 15 రోజుల్లో రంగులు వేసి పూర్తి చేస్తారు.

Advertisement

ఇంత తక్కువ సమయంలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథ నిర్మాణం జరగడం ఆనందముగా ఉందని మంత్రి అన్నాడు.

కేవలం రెండు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిన ఇంజనీర్.. వీడియో చూస్తే..
Advertisement

తాజా వార్తలు