రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ కేసులో కొత్త కోణాలు..!!

రాంనగర్ అఖిల్ పహిల్వాన్( Akhil Pahilwan ) అరెస్ట్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా అఖిల్ పహిల్వాన్ ట్రాక్ రికార్డును పోలీసులు బయటకు తీశారు.

 New Angles In Ramnagar Akhil Pahilwan Arrest Case, Akhil Pahilwan, Ramnagar, Hyd-TeluguStop.com

అఖిల్ మొబైల్ లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల నంబర్లను పోలీసులు గుర్తించారు.ఈ నిర్వహకులతో రోజుకు సుమారు 20 నుంచి 30 కాల్స్ మాట్లాడుతున్నట్లు నిర్ధారించారు.

అలాగే 16 మంది బెంగాల్ యువతులతో ఓ హోటల్ లో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను అఖిల్ హోటల్ లో ఉంచాడని తెలుస్తోంది.నిన్న రాత్రి హైదరాబాద్ అబిడ్స్( Hyderabad Abids ) లోని ఓ హోటల్ లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో వ్యభిచార వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇందులో భాగంగా అఖిల్ పహిల్వాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 16 మంది అమ్మాయిలు మరియు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube