డబ్బులు ఉంచే అల్మారాలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే ధన నష్టం తప్పదు..!

ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎంత ధనం సంపాదించిన ఖర్చయిపోతూ ఉంటాయి.

వాస్తు సరిగ్గా లేకపోతే కొన్ని వస్తువుల వల్ల తీవ్ర నష్టాన్ని చూడవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లోని ప్రతి వస్తువు ను ఎలా మార్చుకోవాలి.ఇలాంటి వస్తువు ఏ దిశలో ఉండాలి వంటి విషయాల పై ప్రత్యేక శ్రద్ధ కచ్చితంగా పెట్టాలి.

మనం డబ్బులను దాచుకునే పెట్టెలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే ధనం హారతి కర్పూరంలా కరిగిపోతూ ఉంటుంది.కొన్ని నెగటివ్ వస్తువులు అల్మారా లో( Locker ) పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు.

ముఖ్యంగా చెప్పాలంటే విలువైన పత్రాలను, డబ్బులను బీరువాలో పెడుతూ ఉంటారు.

Never Keep Things In Money Locker Details, Money, Locker, Things, Vastu, Almara,
Advertisement
Never Keep Things In Money Locker Details, Money, Locker, Things, Vastu, Almara,

అయితే కేవలం ఇవి మాత్రమే లాకర్లలో పెట్టుకుంటే సమస్య ఉండదు.కానీ ఇతర వస్తువులను పెట్టినప్పుడు రకరకాల ప్రతికూల శక్తులు చేరే ప్రమాదం ఉంటుంది.ఫలితంగా డబ్బు వచ్చే దారి మూసుకుపోతుంది.

ఆ వస్తువులు ఏంటో ఎవరి పెట్టెలో ఆ వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.కొంతమంది బీరువాలో అద్దాలను( Mirror ) అమర్చుకుంటూ ఉంటారు.

కానీ ఇలా అమర్చడం అసలు మంచిది కాదు.వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టానికి గురవాల్సి వస్తుంది.

అలాగే కొంతమంది పెర్ఫ్యూమ్స్ లను కూడా లాకర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు.పెర్ఫ్యూమ్స్( Perfumes ) అల్మారా లో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏర్పడి ధన నష్టం కలుగుతుంది.

Never Keep Things In Money Locker Details, Money, Locker, Things, Vastu, Almara,
పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

కొంతమందికి ధనాన్ని వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది.అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో అస్సలు ఉండకూడదు.నల్లని వస్త్రంలో( Black Cloth ) చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చు అయిపోతుంది.

Advertisement

అందుకే డబ్బును ఎప్పుడు నల్లటి గుడ్డలో పెట్టకూడదు.ఏదైనా చిరిగిన కాగితాలను డబ్బు దాచుకునే బీరువాలో దాచకూడదు.

దీనివల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు.

అందుకే డబ్బు ఉంచే ప్రదేశంలో వీటిని అస్సలు ఉంచకూడదు.ఉంచితే తీవ్రమైన ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజా వార్తలు