రాను రాను లోకంలో మనుషులు జ్ఞానాన్ని మరచి ప్రవర్తిస్తుండంటం వింతగా తోస్తుందట.అసలు చదువు “కొనడం” వల్ల ఉన్న మతి పోయి ఇలా ప్రవర్తిస్తున్నారనుకునే వారు లేకపోలేదు.
ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎంత పవర్ ఫుల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.అలాంటి సోషల్ మీడియాను అక్కరకు రాని విషయాలకు, సిల్లి సిల్లి క్వచ్చన్స్ వేయడానికి లేదా చెడు చేయడానికి ఊపయోగిస్తున్న మనుషుల మెదడు దొబ్బిందని అనుకోవడంలో తప్పులేదంటున్నారు కొందరు.
ఎందుకంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏవైన కష్టాలుంటే తనకు ట్విట్టర్ లో తెలియచేయాలని పేర్కొన్నారు.దీన్ని అలుసుగా తీసుకున్న తోటకూరి రఘుపతి అనే వ్యక్తి తాను జొమాటో ద్వారా లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని ఆర్డర్ చేయగా, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చిన జొమాటో వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని ట్విట్టర్ లో ట్యాగ్ చేశారట.
దీనికి కేటీఆర్ అసహనంగా స్పందించారట.ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోవాలి గానీ మరీ కేటీఆర్ ట్విట్టర్‌ను ఇలా వాడటం భావ్యమా బ్రదర్ అంటూ మిగతా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారట.
