గోల్డెన్ గర్ల్ అంటూ రష్మిక పోస్ట్.. డ్రెస్ సరిగ్గా వేసుకోలేవా అంటూ ట్రోల్స్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ వంటి రేంజ్ లో దూసుకెళ్తున్న వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒకరు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

 Netizens Trolls Rashmika Mandanna On Her Golden Girl Post Viral Details, Rashmik-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా ఒక టైటిల్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉందని చెప్పవచ్చు.

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.

ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.

ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.పైగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా బాగా బిజీగా మారింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.

తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ విషయాలను తెగ షేర్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ.

ఇక ఈ బ్యూటీ కేవలం సినిమాలలోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకున్న ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ బ్యూటీకి బాగా ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి.ఎందుకంటే ఈ బ్యూటీ బయట చేసే హల్ చల్ అలా ఉంటుంది కాబట్టి.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో తను గోల్డ్ కలర్ లో ఉన్న డ్రెస్ ధరించి.తను గోల్డెన్ గర్ల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఆ డ్రెస్సులో తను ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఓ నెటిజన్ డ్రెస్ సరిగ్గా వేసుకోలేవా అంటూ కామెంట్ పెట్టారు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అయింది.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube