Niharika Konidela :భర్తను తప్ప అందర్నీ దగ్గర చేసుకుంటున్నావు.. మెగా డాటర్ కు నెటిజన్స్ షాక్?

Netizens Trolls On Sharing Photos About 5am Club Details Inside

మెగా డాటర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే బ్యూటీ నిహారిక( Niharika ).టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ హోదాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

 Netizens Trolls On Sharing Photos About 5am Club Details Inside-TeluguStop.com

ఇక నటిగా అంత సక్సెస్ కాలేకపోయినా కూడా వ్యక్తిగతంగా మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో పలు సినిమాలలో నటించింది.

కానీ అంతగా సక్సెస్ కాలేక పోయింది.దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఇక ఆ తర్వాత వెబ్ సిరీస్ లకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.నిర్మాతగా బాగానే సక్సెస్ లు అందుకుంటుంది.

ఇక తన తండ్రి తీసుకొచ్చిన సంబంధమైన చైతన్య జొన్నలగడ్డ( Chaitanya jonnalagadda )ను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత నిహారిక మొత్తం మారిపోయింది.

తన వేషధారణతో మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా చేసింది.ఏకంగా గ్లామరస్ గా తయారవుతూ అందరి దృష్టిలో పడింది.

ఇప్పటివరకు మెగా కూతుర్లు ఇంతగా గ్లామర్ షో అయితే చేయలేదు అని చెప్పాలి.

Telugu Chaitanya, Niharika, Tollywood-Movie

ఇక నిహారిక గతంలో డ్రగ్ కేసు లో కూడా ఇరికింది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఆ సమయంలో ఆ పబ్ కేస్ లో దొరికిపోవటంతో సోషల్ మీడియా కు దూరం గా ఉంది.అయితే అంతకు ముందు మాత్రం సోషల్ మీడియాలో తన భర్త ఫోటోలను, వీడియో లను బాగా షేర్ చేసుకునేది.

ఇక ఆ కేసులో ఇరకటంతో సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది.మళ్లీ సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత యాక్టివ్ గా మారింది.ఎప్పటిలాగే తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఉంది.అయితే గతంలో తన భర్తను దూరం పెట్టిందని కొన్ని వార్తలు వినిపించాయి.

కానీ అప్పుడే తన భర్తతో దిగిన ఫోటో పెట్టడంతో అదంతా పుకారని తెలిసింది.ఇక ఇప్పుడు.

గత కొన్ని రోజుల నుండి మళ్ళీ తన భర్తను దూరం పెట్టిందని తెలిసింది.

Telugu Chaitanya, Niharika, Tollywood-Movie

కనీసం ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా తన భర్తతో ఉండట్లేదని.అంతేకాకుండా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని.ముఖ్యంగా తమ పెద్దవాళ్లకు తెలియకుండా ఇద్దరు వేరే వేరే ఇళ్లల్లో ఉంటున్నారని తెలిసింది.

పైగా సోషల్ మీడియాలో కూడా తన భర్త ఫోటోలు పంచుకోకపోవడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.అంతేకాకుండా చైతన్య కూడా పెళ్లి ఫోటోలు డిలీట్ చేయటంతో అనుమానాలు మరింత బలంగా మారాయి.

కానీ దీని గురించి మెగా ఫ్యామిలీ మాత్రం అస్సలు స్పందించడం లేదు.అయితే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక ఎప్పుడైతే ఈ పుకార్లు రావడం మొదలయ్యాయో అప్పటినుంచి తన ఫోటోలను పంచుకోవడం మొదలుపెట్టింది.

దీంతో జనాలు మరింత అనుమానం పడుతున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా జిమ్ లో మరో వ్యక్తితో ఫోటో దిగుతూ కనిపించింది.ఇక దానిని స్టోరీ రూపంలో పంచుకుంది.ఇక ఆ స్టోరీ చూసి నెటిజన్లు ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.

భర్తని తప్ప అందరిని బాగానే దగ్గర చేసుకుంటున్నావు కదా అంటూ షాక్ ఇస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube