సోషల్ మీడియా ప్రభావం అందరిలో విపరీతంగా పెరిగిపోయింది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలకు సోషల్ మీడియా ఒక వ్యసనంలా మారిందని చెప్పవచ్చు.తాము ఏమి చేసినా వాటిని సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేసుకుంటున్నారు.
ఇప్పటికి ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా లో ఎన్నో విషయాలు పంచుకున్నారు.
ఇక ఫోటో షూట్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
బాగా స్లిమ్ గా మారి ఫోటోలతో బాగా హడావిడి చేస్తున్నారు.ఇక కొంతమంది మాత్రం స్లిమ్ అంటూ బక్క చిక్కి దారుణంగా మారుతున్నారు.
దీంతో వాళ్ల ఫోటోస్ చూసి నెటిజన్స్ షాక్ అవుతూ తెగ ట్రోల్స్ చేస్తుంటారు.అలా తాజాగా యాంకర్ శ్యామల కూడా అటువంటి ట్రోలింగ్స్ ఎదురుకున్నది.
ఇంతకూ ఏం జరిగిందంటే.
బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే.
తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో పలు పాత్రల్లో మెప్పించింది శ్యామల.
ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.
తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.

చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.
శ్యామల ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.
ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక యూట్యూబ్ లో ‘ఏం చెప్పారు శ్యామల గారు’ అనే పేరుతో ఛానల్ కూడా ప్రారంభించింది.

ఇక అందులో చాలా వీడియోలు పంచుకుంది.ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలను బాగా చేస్తుంది.అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటుంది.
తన ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిన వీడియోలను.తన కొత్త ఇంటి వీడియోను కూడా హోమ్ టూర్ చేసి తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది.
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటోను పంచుకుంది.ఆ ఫోటో చూసిన తన ఫ్యాన్స్ బాగా షాక్ అయ్యారు.కారణం ఏంటంటే.తాను బాగా బక్కగా కనిపించింది.
దీంతో ఓ నెటిజన్.నీకు దండం పెడతా అక్క.
ఆ డైట్ లు వర్క్ అవుట్ లు మానేసి నిండుగా ఉండు.బాగుంటావ్.
ఆ ఎముకలు బయట పడిపోయే కంటే అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.







