సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.క్రేజీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో రజనీకాంత్ తర్వాత సినిమాలు తెరకెక్కుతున్నాయి.
విమర్శలకు, వివాదాలకు రజనీకాంత్ దూరంగా ఉంటారు.అయితే రజనీకాంత్ తాజాగా చేసిన ఒక పని మాత్రం విమర్శలకు తావిస్తోంది.
రజనీకాంత్ కావాలని చేయకపోయినా నెటిజన్లు మాత్రం ఆయనను ట్రోల్ ( Trolls )చేస్తున్నారు.అనంత్ అంబానీ( Anant Ambani ) ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు పనిమనిషి కూడా హాజరయ్యారు.
అయితే ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని ఫోటోగ్రాఫర్లు కోరుతున్న సమయంలో పనిమనిషిని వెనక్కు వెళ్లాలని రజనీకాంత్ సూచించగా ఆమె వెనక్కు వెళ్లిపోయారు.
అయితే రజనీకాంత్ సాధారణంగానే అలా చేసినా కొంతమంది నెటిజన్లు( Netizens ) ఆయనను టార్గెట్ చేసి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.సినిమాలలో నీతులు చెప్పే రజనీకాంత్ రియల్ లైఫ్( Real Life ) లో ఇలా చేయడం ఎంతవరకు రైట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.రజనీకాంత్ అలా సైగ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.
ఫ్యామిలీ పిక్( Family Pic ) కావాలని కోరడంతో రజనీ అలా చేశాడే తప్ప ఆమెను అవమానించాలనే ఆలోచన రజనీకి లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ ఈ విమర్శల గురించి, వివాదం గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.కొంతమంది కావాలని రజనీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రజనీకాంత్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రజనీకాంత్ పారితోషికం విషయంలో కూడా సౌత్ ఇండియాలోని టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు.ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం గమనార్హం.
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ( Laal Salaam ) అతి త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.