ఆ నటి వింత డ్రస్సు.. బిచ్చగత్తె అంటూ ఉర్ఫీ జావేద్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.

 Netizens- Trolling On Urfi Javed New Dress And Called Her Beggar Urfi Javed, Tro-TeluguStop.com

అదే విధంగా ఏదో ఒక విషయంలో ట్రోలింగ్స్ కీ గురవుతూనే ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కీ గురయ్యే వారిలో ఉర్ఫి జావెద్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.

ఈమె ఎక్కువగా డ్రెస్సింగ్ విషయంలో దారుణంగా ట్రోలింగ్స్ కీ గురవుతూ ఉంటుంది.ఉర్ఫి జావెద్ ఎక్కువగా ఆమె వస్త్రధారణ విషయంలో బాగా పాపులర్ అయ్యింది.

ఈమె ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రకరకాల స్టైల్లో ప్లాస్టిక్స్ కాగితంతో డ్రెస్‌, విరిగిన అద్దాల‌తో చేసిన డ్రెస్‌,ఆల్చిప్ప‌ల‌తో ఎద అందాల‌ను క‌ప్పుకునేలా డ్రెస్.ఇలా ఒక్కటేమిటీ ఎన్నెన్నో వెరైటీ దుస్తుల‌ను వేసుకుని త‌న ఫాన్స్, ఫాలోవ‌ర్స్‌కు కావాల్సినంత ఆనందాన్ని, నెటిజ‌న్స్‌కు వినోదాన్ని అందిస్తుంటుంది.

ఆమె వేసుకునే ఇలాంటి దుస్తుల కార‌ణంగా నెటిజ‌న్స్ ఆమెను ట్రోల్ కూడా చేస్తుంటారు.ఈమె వేసుకొనే ఆ వస్త్రాలు అయితే ఒక్కసారి మరి దారుణంగా ఉంటాయి.

అయితే ఎవ‌రేమ‌నుకున్నా.నా దారి నాదే, నా తీరు నాదే అన్న విధంగా వ్యవహారిస్తూ వెళ్ళిపోతుంటుంది ఈ అమ్మడు.అయితే తాజాగా మ‌రోసారి ఉర్ఫి జావెద్‌ ట్రోల్స్ కి గురయ్యింది.ఎప్పుడు వెరైటీ డ్రెస్సుల‌తో వార్త‌ల్లో నిలిచే ఈ అమ్మ‌డు తాజాగా మ‌రో విల‌క్ష‌ణ‌మైన డ్రెస్ వేసుకుని స‌ద‌రు వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంత‌కీ అమ్మ‌డు ఈసారి దేంతో త‌న డ్రెస్‌ను త‌యారు చేసుకుందో తెలుసా! గోనె ప‌ట్ట‌తో, లేదా గోనె సంచితో జ‌న‌ప‌నార‌తో చేసిన గోనె ప‌ట్ట‌ను ఉప‌యోగించి ప‌ది నిమిషాల్లో డ్రెస్ చేసుకున్న ఉర్ఫి జావెద్ దాన్ని ధ‌రించిన త‌ర్వాత వీడియోను కూడా పోస్ట్ చేసింది.కొంద‌రు ఆమెను మెచ్చుకుంటుంటే.

కొంద‌రు మాత్రం ఆమె బిచ్చ‌గ‌త్తెలా డ్రెస్ లేకుండా ఇబ్బంది ప‌డుతోంద‌ని, ఆమెకు దుస్తుల‌ను ఇవ్వాలంటూ ట్రోల్ చేస్తున్నారు.కానీ ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టిన కూడా ఆమె తన లైఫ్ తన ఇష్టం అన్న విధంగా వ్యవహారిస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube