ఫస్ట్ అది సెట్ చేసుకోండి.. రోహిణి డాన్స్ వీడియోపై ట్రోల్స్?

అప్పుడప్పుడు నెటిజన్స్ సెలబ్రిటీలను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.వాళ్ళు ఏది చేసినా కూడా తప్పు పడుతూ ఉంటారు.

 Netizens Trolling On Actress Rohini Dance Video Viral Details, Rohini,dance Vide-TeluguStop.com

ఎందుకంటే వాళ్లకు అదో సరదా.  సెలబ్రిటీలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు.

అయితే తాజాగా బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి పై కూడా ట్రోల్ చేస్తున్నారు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పవచ్చు.  రోహిణి మొదట్లో పలు సీరియల్స్ లో నటించి బుల్లితెరపై పరిచయాన్ని పెంచుకుంది.

కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.

దీంతో అప్పటి నుంచి రోహిణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత పలు సీరియల్ లలో అవకాశాలు కూడా అందుకుంది.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.

సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.

కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.

బిగ్ బాస్ తర్వాత రోహిణి జబర్దస్త్ లో బాగా బిజీగా మారింది.లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్విస్తుంది.

జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా  అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో    ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.చేసే ప్రతి అనిని వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.

ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.ఇక ఈమధ్య రోహిణి కాస్త అందాన్ని కూడా పెంచింది.

ఒకప్పుడు లావుగా కనిపించిన రోహిణి ఇప్పుడు కాస్త బరువు తగ్గించి అందంగా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది.  అప్పుడప్పుడు తన వంటలు చేసే వీడియోలని యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక రీల్ వీడియో పంచుకుంది.అందులో తను ఒక పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది.  అయితే తను అందులో జీన్స్ వేసుకోగా అది ఫ్యాషన్ గా చినిగి ఉంది.అంతేకాకుండా తాను బెల్ట్ కూడా సరిగా పెట్టుకోకపోవడంతో అది ముందుకు వచ్చింది.

దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ ముందు బెల్ట్ సరి చేసుకోండి.ఆ తర్వాత డాన్స్ చేయండి అంటూ ట్రోల్ చేశారు.

మరి కొంతమంది చినిగిన ప్యాంటు వేసుకున్నావ్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube