దాని గురించి ప్రమోట్ చేసిన హిమజ.. ఎప్పుడు ఇదే పనేనా అంటూ ట్రోల్స్?

తెలుగు బుల్లితెర, వెండితెరకు పరిచయమున్న బ్యూటీ హిమజ.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Netizens Trolling Himaja Latest Promotional Video Details, Himaja ,tollywood,big-TeluguStop.com

బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సంపాదించుకుంది.వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు మార్కులు సంపాదించుకుంది.

  సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ.నిత్యం తన ఫోటోలను, వీడియోలతో రచ్చ చేస్తుంది.

హిమజ తొలిసారిగా భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.

అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో పాల్గొని బాగా సందడి చేసింది.ప్రస్తుతం హిమజ ను చూస్తే మాత్రం ఒకప్పటి హిమజ కు ఇప్పటి హిమజ కు చాలా తేడా ఉంది.

ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్ తో‌ పరిచయమైన హిమజ ప్రస్తుతం పొట్టి పొట్టి దుస్తులతో గ్లామర్ ను పెంచుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే హిమజ నిత్యం తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న క్షణంలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది.దీంతో ఈమెకు మరింత క్రేజ్ కూడా పెరిగింది.అలా ఓ వైపు పలు ప్రాజెక్టులతో పాటు వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.

ఇక బుల్లితెరపై ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.అవకాశాలు లేకపోవడంతో వచ్చిన ప్రోడక్ట్ లను ప్రమోట్ చేస్తుంది.ఇప్పటికే పలు రకాల సర్ఫ్ లు, ఫేస్ క్రీమ్ ల గురించి ప్రమోట్ చేసింది.ఇక ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉండేది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరొక వీడియో పంచుకుంది.

అందులో కూడా తను టైడ్ లిక్విడ్ కి సంబంధించి ప్రమోట్ చేసింది.

తన పెంపుడు కుక్క తగలడం వల్ల తన తాగుతున్న కాఫీ తన డ్రెస్ పై పడటంతో.ఆ మరక గురించి చెబుతూ ఆ లిక్విడ్ వాడమని ప్రమోట్ చేసింది.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.పెళ్లి చేసుకోవా.ఎప్పుడు ఇంకా కుక్కలతోనే ఉంటావా.ప్రమోషన్ క్వీన్.

అంటూ ఒకరు కామెంట్ చేయగా.నువ్వు చెప్తున్నావని ట్రై చేస్తా.

లేకపోతే నీ మీద కేసు వేస్తాను.అంటూ మరొకరు కామెంట్ చేశారు.

నీకు ఎప్పుడు ఈ ప్రమోషన్స్ పిచ్చినా.పెయిడ్ ఆర్టిస్ట్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube