Ariana: వాటికి కాస్త గ్యాప్ తీసుకో.. అరియానాకు నెటిజన్స్ ట్రోల్స్?

మామూలుగా కొందరు జనాలు ఎవరైనా సెలబ్రిటీ అతిగా ప్రవర్తిస్తే చాలు వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతూ ఉంటారు.కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్లు వారిని విమర్శలు చేస్తూ ఉంటారు.

 Netizens Trolling Ariyana Latest Photoshoot Pics Viral-TeluguStop.com

ఇక సోషల్ మీడియా కమ్యూనికేషన్ అందుబాటులో ఉండటంతో ఇక వారు చేసే ప్రతి పోస్టుకు బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.ఇక ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఆ సెలబ్రెటీలు మాత్రం పట్టి పట్టనట్లుగా ఉంటారు.

అందులో ఒకరు అరియానా.

బిగ్ బాస్ సీజన్ 4 లో బోల్డ్ అంటూ బాగా రచ్చ రచ్చ చేసిన హాట్ బ్యూటీ అరియానా ( Ariyana ) గురించి అందరికీ తెలిసిందే.

యూట్యూబ్ లో యాంకర్ గా పనిచేసిన ఈమె ఓ సారి స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను( Ram Gopal Varma ) ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఇక బిగ్ బాస్( Bigg Boss ) తర్వాత కొన్ని షోలల్లో పాల్గొని.

అంతేకాకుండా బిగ్ బజ్ లో కూడా ఇంటర్వ్యూలు చేసింది.యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

గతంలో బీబీ జోడి డాన్స్ ప్రోగ్రాం లో పాల్గొని వచ్చి రాని స్టెప్పులతో కొంతవరకు శభాష్ అనిపించుకుంది.ఇక ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ తో కనిపిస్తుంది.

ఫ్రెండ్స్ తో పార్టీలు అంటూ పబ్బులు అంటూ తెగ తిరిగేస్తూ ఉంటుంది.ఈ మధ్య బాగా అందాలను కూడా పరిచయం చేసింది అరియానా.మొదట్లో సన్నగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయ్యింది.ఇక ఈమె బొద్దుగా తయారవడానికి కారణం కొన్ని మెడిసిన్స్ తీసుకుందని వార్తలు వినిపించాయి.

ఇక రోజు వేసుకునే డ్రెస్సుల సైజు తగ్గించి బాగా బరి తెగిస్తుంది.తను తయారయ్యే విధానం గురించి సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రెచ్చిపోతుంది.ఇక హాట్ హాట్ గా ఫోటో షూట్లు చేయించుకుంటూ ఆ ఫోటోలతో కుర్రకారును తన వైపుకు మలుపుకుంటుంది.ఇక ఉన్నట్టుండి సడన్గా ఆమెలో మార్పులు రావటంతో ఇదంతా అవకాశాల కోసమే చేస్తుంది అని చాలామంది అంటున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇన్స్టాల్ ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో బ్లూ షార్ట్ డ్రెస్ ధరించి రెడ్ కలర్ లో ఉన్న సోఫాలో కూర్చొని కెమెరాకు హాట్ గా ఫోజులు ఇచ్చింది.ముఖ్యంగా అందులో తన థైస్ అందాలు కనిపించాయి.దీంతో ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోకి లైక్స్ కొట్టగా హేటర్స్ మాత్రం దారుణంగా బూతులు తిడుతున్నారు.కాస్త ఫోటో షూట్లకు గ్యాప్ ఇవ్వు.నీ బోరింగ్ ముఖం చూడలేకపోతున్నాము అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఆమె ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube