Niharika: నిహారిక దయచేసి ఆ పని చేయకు… నిహారిక ఫోటోలపై నేటిజన్స్ షాకింగ్ కామెంట్?

మెగా డాటర్ నిహారిక ( Niharika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి యాంకర్ గాను హీరోయిన్ గాను పరిచయమైనటువంటి ఈమె పెళ్లి చేసుకుని తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రస్తుతం తిరిగి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

 Netizens Shocking Comments On Niharika Photos-TeluguStop.com

నిహారిక పలు వెబ్ సిరీస్లలో ( web series )నటించడమే కాకుండా ఈమె నిర్మాతగా కూడా మారిన సంగతి మనకు తెలిసిందే.ఇలా నిర్మాతగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం నిహారిక సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో భాగంగా ఈమె 2023లో తన సారీ పిక్స్ అన్నింటిని ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఏడాది మరి కొద్ది రోజులలో పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో నిహారిక ఈ ఇయర్ లో తన శారీ పిక్స్ కొన్నింటిని ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో నిహారిక ఎంతో సంతోషంగా మనస్పూర్తిగా నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.అయితే నిహారిక నవ్వడంతో తన పళ్ళు చిగుర్లు మొత్తం కనపడతాయి అనే సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా నిహారిక నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇందులో యాడ్ చేయడంతో కొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మ నిహారిక దయచేసి నువ్వు ఫోటోలకు అలా నవ్వకు నీ పళ్ళను చూడలేకపోతున్నాము అంటూ నిహారిక నవ్వుపై అలాగే ఆమె పళ్ళ గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది నిహారిక శారీలో చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కూడా ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.నిహారిక తన పళ్ళ గురించి కూడా భారీ స్థాయిలోనే ట్రోల్స్ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పాలి ఇదివరకు కూడా చాలా మంది నేటిజన్స్ మీరు ఇలా నవ్వకండి నవ్వితే చూడలేకపోతున్నాము అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం నిహారిక షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube